రక్తం 'వరద'లా పారిస్తున్న మాజీ ఎమ్మెల్యే ?

Publish Date:Mar 9, 2012

Advertisement

ఆ రాజుగారికి 18 తుపాకీ లైసెన్స్ లు                               
  తెలు
గువన్.కామ్ ప్రత్యేక కథనం                              
హైదరాబాద్:
ఆయన మాజీ ఎమ్మెల్యే . కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దందాలు, సెటిల్ మెంట్లు చేస్తుంటారు . అడ్డువచ్చిన వారి ప్రాణాలుతీసి రక్తాన్ని వరదలా పారిస్తుంటారు. ఈ 'రాజుల రెడ్డి' గారికి తన ప్రాణాలకంటే ఎంతోప్రీతి. తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవటానికి 18 తుపాకులకు లైసెన్స్ లు తీసుకుని ఉంచుకున్నారు. అయితే తన ప్రాణరక్షణకోసం ఈ తుపాకులు తీసుకున్నానని  ఆయన చెబుతున్నప్పటికీ వాటితోనే ఇతరుల ప్రాణాలను హరిస్తుంటారని ఆయనంటే గిట్టనివారు ఆరోపణ చేస్తూ ఉంటారు. ఆయన డబ్బుకోసం ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఎన్నో ఏళ్ళుగా తనను నమ్ముకున్నవారు కూడా తనకు ద్రోహం చేశారని అనుమానం వస్తే వాళ్ళను సఫా చేస్తుంటారు. ఇటీవల రూ.30 కోట్ల విలువచేసే భూమిని సొంత చేసుకునేందుకు చక్రపాణి అనే ఒక ఆడిటర్ ను హత్యచేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. తాను చెప్పిన వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వకపోతే ఆయనకు ఆగ్రహం వస్తుంది. మందీ మార్భలంతో కత్తులు, కటార్లతో బ్యాంకు కార్యాలయాలపై దాడి చేసి సిబ్బందిని బైటకు ఈడ్చి వాటికి తాళాలు వేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. మూడు దశాబ్దాలపాటు ఆయనకు అండదండగా నిల్చిన సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకు తోక జాడించాడనే అనుమానంతో ఆ తోకనేకాక అతని పీకను కూడా ఈయన కత్తిరించాడు. శత్రుశేషం మిగల్చకూడదన్న విదుర నీతిని వంటబట్టించుకున్న ఈ రాజుల రెడ్డిగారు ఆయన కుమారుడిని సైతం పరలోకానికి పంపారు. మాలేపాడుకు చెందిన ఒక మాజీ సర్పంచ్ హత్యకేసులోనూ, మరో ముగ్గురు అమాయకుల హత్యకేసులోనూ ఈయన గారికి ప్రమేయం ఉన్నట్లు ప్రత్యర్ధులు అంటున్నారు. ఇతని ఆగడాలు పోలీసులకు తెలిసినప్పటికీ వారెవరూ ఈయన ఇంటివైపు కన్నెత్తి చూడటానికి సాహసించరు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ మద్దతుతో చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ప్రాంత నేతలను కూడా వదలడం లేదు. వారిని కూడా నిత్యం బెదిరింపులతో విసిగిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయాన జగన్ కి చెప్పినప్పటికీ ఆయన కూడా ఈ రాజుల రెడ్డిగారిని ఏమీ చేయలేకపోతున్నాడు.

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.