Publish Date:Aug 26, 2012
ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ప్రహాసనంగా మారింది. అన్నీ కాలేజీలకు ఒకే ఫీజు విధానం ఉండాలని ప్రయివేటు కాలేజీలు మొరాయిస్తున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ వత్తిడి మేరకు 35 వేల రూపాయలకు ఆమోదించినప్పటికీ మరికొన్ని కాలేజీలకు 50,200 రూపాయలు కోర్టు ఉత్తర్యుల ద్వారా పొందటంతో మరికొన్ని కళాశాలల ఫీజు ఎఐఆర్‌సి ద్వారా వెలువడనున్న నేపద్యంలో ఇంజనీరింగ్ కాలేజీల సమస్య మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. ఇప్పటికే ఆలస్య మయ్యిందని, రీఎంబర్స్‌మెంట్ ప్రభుత్వమే భరించాలని విద్యార్ధిసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజును ఖరారు చేయకుండానే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. రాష్ట్రంలో ఎమ్‌సెట్ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరాల్సిన విద్యార్ధులకు భవిష్యత్ అంధకారంగా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తైపోయి నెలరోజులయ్యింది. రెగ్యులర్ గా క్లాసులుకూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటిదాకా కౌన్సిలింగ్ కే దిక్కులేదు. తీరా కౌన్సిలింగ్ తేదీల్ని ప్రకటించాక, కాలేజీ యాజమాన్యాలు.. ఫీజులు అందరికీ సమానంగా ఉండాలంటూ కొత్త ఆందోళన మొదలుపెట్టాయి. ఫీజలు పెంచకపోతే కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు, పెంచితే బిసిలకు రిఎంబర్స్‌మెంట్ ఇవ్వటం కష్టమని ప్రభుత్వం గట్టిగా పట్టుపడుతున్నాయి. విద్యార్థులకు మాత్రం పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/engineering-24-16886.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.