ఆదాయం కావాలి కాని....

Publish Date:Oct 4, 2012

Advertisement

మంత్రిగారింట్లో పెరటిగోడ గేటు పిల్లల ఆటల్లో ఊడిపోయిందంటే ఆ వార్త ముద్రణ అయ్యేలోపే ఆ గేటు, ఆ గోటున్న గోడను కూడా వెంటనే బాగుచేసేస్తారు.  కాని... కోట్లల్లో... లక్షల్లో... ఆదాయాలను దండుకుంటూ... ఎక్కువ ఆదాయం వస్తూ దేవాదాయశాఖలో కలవని దేవాలయాలను కలుపుకుంటూ.. కనీసం రక్షణచర్యలు కూడా తీసుకోకుండా ఆర్జనపైనే అంతా దృష్టిపెట్టే దేవాదాయశాఖకు నిర్లక్ష్యానికి  భక్తుల నమ్మికకు విఘాతం కలిగించేలా శ్రీశైల మహాక్షేత్రం మహా ప్రాకార కుడ్యం ఉత్తరం వైపు వున్న  శివాజీ గోపురం  కుప్పకూలి కలశాలు సైతం మట్టిలో కూరుకుపోయాయి.   రెండు సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలోని ఆలయ రాజగోపురం  కుప్పకూలిపోయింది. దాని నిర్మాణానికి ఎంతోమంది దాతలు ముందుకువచ్చినా... దేవాదాయశాఖ, పురావస్తుశాఖల వ్యవహరశైలి వల్ల ఇంకా నిర్మాణానికి నోచుకోనేలేదు. ఇప్పుడు ఈ శ్రీశైలం  ఆలయం శివాజీ గోపురం. రాష్ట్రంలోని పలు దేవాలయాల నుండి ప్రతి ఏడాది వచ్చే సొమ్మును దేవాదాయశాఖకు తరలించుకుని దాన్ని  వివిధ రకాలుగా ఖర్చుచేసే ప్రభుత్వ అధికారులు ఆలయాలను, అందలి ఉద్యోగులను, అర్చకులను మాత్రం పట్టించుకోరు.  చివరకు తమ రాజకీయాలను సైతం దేవాలయాలకు సైతం విస్తరించారు.   మిగిలిన మతాలకు  వాటికి సంబంధించి ప్రత్యేక శాఖ ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు.. మరి హిందు దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఎందుకు? దాని వల్ల దేవాలయాలకు ఫలితం ఏముంది? రాజకీయ నాయకుల పునరావాస పదవులకు, ప్రభుత్వానికి ఆదాయం కోసం  తప్ప. ప్రభుత్వం నుండి దేవాదాయశాఖను విడదీసి.. దాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటుచేసి ఆయా ఆలయాలకు చెందిన పూర్వీకులను (ఉన్నవారిలో) కొందరిని ఆయా ప్రాంతాలకు ఎన్నుకుంటే ...అది స్వతంత్రంగా... ఆయా ఆలయాల పర్యవేక్షణ, భద్రత, భక్తుల సేవలు తదితరాలు వారే చూసుకుంటారు. .. ఇందులో మాత్రం రాజకీయ  నాయకులకు చోటు వుండకూడదు!  ఆదాయానికి తీసుకనేందుకు ముందుంటారు కాని....మరమ్మతులకు వస్తే మాత్రం వారికి వినపడదు, కనపడదు. నే ఎక్కేబండి జీవితకాలం లేటు అన్నట్లుగా కాకుండా ఇప్పటికైనా నేతలు, అధికారులు మేల్కొని.. రాష్ట్రంలో శిథిలావస్థలో వున్న ఆదాయంతో పనిలేకుండా అన్నిటికి మరమ్మతులు చేయించాలని.. లేదంటే.. ఇది కోట్లాదిమంది భక్తుల నమ్మికను మోసంచేసినట్లవుతుందని... భక్తులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.