వివాదాలకు దూరంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు హఠాత్తుగా విమర్శల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్టును ఆయన సూపా పార్వతి అనే మహిళకు ఇప్పించారు. ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు కావూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావూరి సాంబశివరావు రాజకీయ వలసపక్షి లాంటివాడని, గతంలో బందరు ప్రస్తుతం ఏలూరు ఎంపిగా ఉన్న కావూరి వచ్చే ఎన్నికల్లో ఎక్కడనుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియాలని, అటువంటి వ్యక్తి జిల్లా పార్టీ వ్యవహారంలో పరిస్థితులు తెలుసుకోకుండా వేలు పెడితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. సూపా పార్వతి అసలు కనగ్రేస్ పార్టీ సభ్యురాలే కాదని అటువంటి వ్యక్తికీ కావూరి టిక్కెట్ ఎలా ఇప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొదట పోలవరం టిక్కెట్టును బాడిశ బోజ్జిదొరకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ, కావూరి సాంబశివరావు తన పలుకుబడిని ఉపయోగించి పార్టీకి సంబంధం లేని సూపా పార్వతికి టిక్కెట్టు ఇప్పించారు.
ఆమె తండ్రి ఒక పార్టీలోనూ, సోదరుడు మరో పార్టీలోనూ పని చేస్తున్నారని అటువంటి కుటుంబంలోని వ్యక్తికీ టిక్కెట్టు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్టు గల్లంతు కావటం ఖాయమని కావూరిని విమర్శిస్తున్నారు. ఏలూరు ఎంపిగా కావూరి ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఇటువంటి వివాదాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. వచ్చే ఉప ఎన్నికల్లో ఆయన సూచించిన సూపా పార్వతి ఓడిపోతే కావూరి మరిన్ని విమర్శలకు గురి కావలసి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eluru-mp-kavuri-sambashivarao-24-13910.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.