రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో తెలుసా?!

Publish Date:Jun 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అధికార వర్గాలను కుదిపేసిన  మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా, వైసీపి ఎన్నారై విభాగంలో కీలకంగా  వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం (జూన్ 11)  అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో ఒకేసారి విస్తృతంగా సోదాలు నిర్వహించిన అనంతరం రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం.    ఈ కుంభకోణంపై ఏర్పాటైన ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య  రాజ్ కేశిరెడ్డిని గతే ఏడాది ఏప్రిల్‌లోనే అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి  ఏడాది   జైలులోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ..  ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడం రాజకీయవర్గాలలోకలకల రేపుతోంది.  

గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా,  ఈడీ ఎంట్రీ తో కథ  కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్  గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్, టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన  మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు సంస్థ  ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ   అటాచ్ కూడా చేసింది. 

ఏపీ మద్యం కుంభకోణంలో  దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే, ఈ బాగోతం తాలూకు వేళ్లు అల్టిమేట్‌గా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ  జోరుగా నడుస్తోంది. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి  అత్యంత సన్నిహితుడిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో వైసిపి సీనియర్ నేత  విజయసాయిరెడ్డి సైతం ఈడీ విచారణకు హాజరైనప్పుడు, మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసని..  ఆయనే దీనికి అసలైన మాస్టర్‌మైండ్ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఆఫీస్ నుంచే ఈ భారీ వసూళ్ల నెట్‌వర్క్ అంతా నడిచిందని అధికారులు పక్కాగా గుర్తించారు.

ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈడీ కస్టడీలోకి వెళ్లడంతో ఈ మహా కుంభకోణం తాలూకు అసలైన లబ్ధిదారులు ఎవరనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. . వైసీపికి చెందిన ఒక సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడితో పాటు మరికొందరు కీలక నేతలకు చేరినముడుపుల) గుట్టు ఇప్పటికే ఛేదించిన ఈబీ..  ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా, రానున్న రోజుల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా విచారణకు పిలుస్తూ.. నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా ఉండగా రాజ్ కేసిరెడ్డి అరెస్టు తరువాత ఈడీ లక్ష్యం ఎవరన్న ఆసక్త కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్ FDE ఉద్యోగాల డిమాండ్, రూ. 1.4 కోట్ల భారీ జీతాల ప్యాకేజీలు మరియు AI అమలులో వీటి ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.