హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ కు ఊహించని రెండు షాకులు!!

Publish Date:Oct 5, 2019

Advertisement

 

ఇటీవలే హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు రెండు వారాల ముందు ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు ఎదురుకోలేని షాక్ లను ఇచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనను హుజూర్ నగర్ ఎన్నికల విధుల నుంచి తప్పించడమే కాకుండా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేసింది. వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ ను ఎంపిక చేసి, సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది.మరొక షాక్ గా ఆదాయ పన్ను శాఖలో సింగంగా పేరుగాంచిన బీఆర్ బాలకృష్ణన్ ను హుజూర్ నగర్ కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా నియమించింది. ఆయన ఎన్నికల్లో డబ్బు పంపిణీని అడ్డుకోవడంలో కడు సమర్థుడు. ఆయన ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా రెండు శాసన సభ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు పట్టుకుని ఏకంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన బాలకృష్ణన్ పెద్ద నోట్ల రద్దు సమయంలో కర్ణాటక గోవాల్లో నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని కక్కించారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ప్రస్తుతం రిటైరైన ఎన్నికల సంఘానికి సేవలందిస్తున్నారు. 

వెంకటేశ్వర్లను తప్పించడం బాలకృష్ణన్ ను నియమించడం ఈ రెండు పరిణామాలతో అధికార పక్షానికి ఉప ఎన్నికల్లో ఉండే అవకాశనికి గండి పడినట్లేనని భావిస్తున్నారు. ఎన్నికల యంత్రాంగన్ని పర్యవేక్షించటం ఇంటిలిజెన్స్ అందించే వివరాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవటం వ్యక్తులూ, పార్టీలూ, ఓటర్లకు డబ్బు, మద్యం ఇతర బహుమతులు ఇస్తున్నారనీ 'సీ విజిల్' హెల్ప్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవటం వేయ పరిశీలకుల బాధ్యత. ఇలాంటి చోట్ల గట్టి అధికారులనూ వేస్తే రాజకీయ పార్టీలకు ఉక్కపోత తప్పదు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మురళీధరరావు, వివేక్ తో కూడిన బృందం సీఈసీ సునీల్ అరొరాని కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని నామినేషన్ లు కూడా బెయిల్ రాకుండా అడ్డుకున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోపే ఎన్నికల సంఘం స్పందించి రెండు కీలక నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. ఈ రెండూ నిర్ణయాల ద్వారా ఈసీ ఎన్నికలు తన అదుపాజ్ఞలలో జరుగుతున్నాయని నిరూపించింది. హుజూర్ నగర్ లో నియమించిన ఇద్దరు అధికారులు తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్ణయం పై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 

సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ నేతృత్వంలో సర్పంచ్ ల నామినేషన్ వేయటానికి హుజూర్ నగర్ కు రాగా నామినేషన్ లు దాఖలు చేయనివ్వకుండా వారిని పట్టణ పరిసరాల్లో పోలీసులు అడ్డుకున్నారని భూమన్నను అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు తరలించారని బిజెపి ఆరోపించింది. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని అందుకే భూమన్నను అరెస్ట్ చేశారని విమర్శించింది. పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎస్పీని బదిలీ చేసినట్లు తెలిసింది. జిల్లా అధికార యంత్రాంగం వ్యవహార శైలిపై గత నెలలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి స్వయంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూర్ నగర్ లో గెలుపొందాలని పట్టుదలతో ఉంది. సీనియర్ నేతలను ఇన్ చార్జీలుగా నియమించారు. ఎస్పీతో పాటు, కోదాడ డీఎస్పీ హుజూర్ నగర్ సీఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉత్తమ్ ఇటీవల బాహాటంగా విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పైనే బదిలీ వేటు పడటం అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద నేతల సైతం ఈ ఎన్నికల విషయాన్ని గట్టి పోటీగా భావిస్తుండడాం విశేషం.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.