కూటమిలో విభేదాలు నిజమే.. బీజేపీ నేత సంచలనం.!

Publish Date:Sep 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కూటమి రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై బీజేపీ  సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పలు  అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పార్టీ విధానాలు, అలాగే ఇతర పార్టీలతో ఉన్న సంబంధాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూటమి   సమష్టి కృషితో ముందుకు సాగుతోందని చెబుతూనే.. క్షేత్రస్థాయిలో విభేదాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.  వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. 

త్వరలో జరగనున్న  స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, సర్దుబాటు అంశాలపై  మూడు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న విష్ణు వర్ధన్ రెడ్డి..   భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయ కమిటీల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు.   కూటమి ధర్మం ముందు వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశమే లేదన్న ఆయన మిత్రధర్మాన్ని కూటమి పార్టీలన్నీ పాటిస్తాయన్నారు.  

ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 

గతంలో పార్లమెంటరీ వేదికలపై అంశాలవారీగా కొన్ని సందర్భాల్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపితే తెలిపి ఉండొచ్చు కానీ అంత మాత్రానికే ఆ పార్టీని బీజేపీ బీటీమ్ అనడం సరికాదని చెప్పారు.   త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పోటీ చేసి   విజయం సాధించాలని మూడు పార్టీల శ్రేణులు పట్టుదలతో ఉన్నాయన్న విష్ణువర్ధన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో ఉన్న స్వల్ప విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు.  


[Differences in Allience Dact, Vishnuvardhan Reddy, BJP AP Alliance, TDP Janasena BJP, AP Local Body Elections, Andhra Pradesh Politics]

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.