తెలుగుదేశం, వైసీపీ రెండింటివీ కుటుంబ, ఫ్యాక్షన్ రాజకీయాలే.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు.

తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు. 

 ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.  


[Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.