దిగొచ్చిన పసిడి ధరలు

Publish Date:May 22, 2026

Advertisement

దేశంలో పసిడి ధరలు గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హఠాత్తుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న  అనిశ్చితులు, అంతర్జాతీయ పరిణామాలు,  గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న మార్పుల వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం,  వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం...  యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి   నుంచి తమ లాభాల స్వీకరణకు,  అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా   దేశీయ మార్కెట్లపై పడింది.  

గుడ్ రిటర్న్స్,  బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ సమాచారం మేరకు,  హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నిన్నటి ముగింపుతో పోలిస్తే  980 రూపాయల మేర క్షీణించి 1,56,930లకు దిగివచ్చింది.

 అదే క్రమంలో, సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు 900 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం  1,43,850 వద్ద నిలిచాయి.  కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా భారీ పతనాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా   15,000  రూపాయలు పతనమైంది. 

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.