ఆర్సీబీ ఆల్ రౌండ్ షో.. గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసి ఐపీఎల్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన బెంగళూరు

Publish Date:May 26, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్స్ కు దూసుకెళ్లింది. మంగళవారం (మే 26) ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ లోకి అడుగు పెట్టింది.  లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..  అదే జోరును క్వాలిఫయర్ వన్ లోనూ కొనసాగించింది.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించి..  ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే   అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.  ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వేగంగా పరుగులు సాధించారు. అయితే వెంకటేష్ అయ్యర్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన పడిక్కల్ కూడా వేగంగా పరుగులు చేశాడు. 30 పరుగులు చేసిన పడిక్కల్, 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఒకే ఓవర్ లో ఔటవ్వడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది.

అయితే కెప్టెన్ రజిత్ పటిదార్,  కృణాల్ పాండ్యా పరుగుల వేగం తగ్గకుండా ధాటిగా ఆడారు. ముఖ్యంగా పటిదార్  ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి  గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చేశాడు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 86 పరుగులు సాధించారంటే వారి బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక 255 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది.

ఐపీఎల్ 2026 సీజన్ ఆసాంతం మంచి ఫామ్ లో ఉండి పరుగుల వరద పారిస్తున్న గుజరాత్ ఓపెనర్లు సాయిసుదర్శన్, స్కిప్పర్ శుభమన్ గిల్ లు విఫలమయ్యారు. సాయిసుదర్శన్ దురదృష్టకర రీతిలో హిట్ వికెట్ గా వెనుదిరగగా, శుభమన్ గిల్ ను ఓ అద్భుతమైన బంతితో భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఇక మరో ఇన్ ఫామ్ బ్యాటర్ బట్లర్ ను హేజల్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ ఇక కోలుకోలేకపోయింది.  పవర్‌ప్లే ముగిసేసరికే గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఒక దశలో 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్ ఆ తరువాత  రాహుల్ తివాటియా ధాటిగా ఆడుతూ 69 పరుగులు చేయడంతో ఒకింత గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యి 92 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.  అద్భుత బ్యాటింగ్ తో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన బెంగళూరు స్కిప్పర్ రజిత్ పటిదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.  

By
en-us Political News

  
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.