పార్టీ మారడం లేదు.. కేటీఆర్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం.. మల్లారెడ్డి క్లారిటీ.!
Publish Date:Jul 24, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో తన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గత కొంత కాలంగా కారు దిగడానికి సిద్ధంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లారెడ్డి కల్వకుంట్ల తారకరామారావు..నూటపాతికేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కేటీఆర్ నాయకత్వంలోనే తాను కొనసాగుతానని, బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని మల్లారెడ్డి స్పష్టంచేశారు. రాబోయే రాజకీయ సమరంలో బీఆర్ఎస్ తరఫున తాను కీలక పాత్ర పోషిస్తానని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు విశ్రమించనని శపథం చేశారు. Malla Reddy Party Change, KT Rama Rao, BRS Party Telangana, Malla Reddy Clarity, Telangana Politics, KTR Birthday
http://www.teluguone.com/news/content/dont-leave-brs-36-226956.html





