రష్యా, ఉక్రెయిన్.. మూడు రోజుల కాల్పుల విరమణ
Publish Date:May 8, 2026
Advertisement
రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అగ్రరాజ్యాధినేత డోనల్డ్ ట్రంప్ చొరవతోనే ఈ శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పవచ్చు. రష్యా, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శాంతి దిశగా కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శనివారం నుంచి మూడు రోజులు అంటే మే 11 వరకూ కాల్పుల విరమణ ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. రష్యా విక్టరీ డే వేడుకలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ పాత్ర కూడా కీలకమని పేర్కొన్న ఆయన ఈ కాల్పుల విరమణ కోసం తానే స్వయంగా ఇరు దేశాలనూ అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చెరొక వెయ్యి మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించాయన్నారు. గత రెండేళ్లుగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఈ భీకర యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం కావాలలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/three-days-seize-fire-between-russia-and-ukrain-36-219275.html





