మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు తేలిందని చెప్పారు. కొన్ని ముఖ్య మైన క్లూస్ లభించాయనీ.. వాటి ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన గురువారం (మే 7) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజాన్ రాయ్ ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి తనూజాను దారుణంగా హత్య చేశారు. ఆమెను చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపి రాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దుండగులు ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయని భావించి వెనుక గేటు ద్వారా ఇంట్లోకి ప్రవేశించి.. హత్య అనంతరం అదే మార్గం ద్వారా పరార య్యారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నామని, నింది తులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారు సంవత్స రాలుగా పనిచేసినా అప్రమ త్తంగా ఉండాలని సూచించా రు.
ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటీవల మాజీ డీజీపీ కుటుంబంలో మరణం సంభవించడంతో తనూజ హైదరాబాద్‌లోనే ఉండటం ప్రారంభించారని తెలిపారు. ఈ ఘటనలో ఎంత బంగారం, నగదు అపహరించబడిందన్న అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nepali-gang-murdered--former-ips-officers-wife-36-219240.html
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సరికొత్త ముందడుగు వేశారు.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు.
అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన
బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు నిజానిజాలను నిరూపించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
విజయవాడ సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టిన కారు..!
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.