ఇక్కడ ఇలా.. అక్కడ అలా..!..

Publish Date:Jun 4, 2022

Advertisement

ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. పర్యవశానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో అయితే అది మరింత ఎక్కువ కావాలి. ఘనంగా ప్రకటనలు చేసేయడం.. ఆచరణలోకి వచ్చే సరికి జావగారిపోవడం వల్ల ప్రజలలో పలుచన అవుతారు. అలా కాకుండా నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి చెప్పింది చెప్పనట్లు చేయగలితే ప్రజలలో గౌరవం పెరుగుతుంది.

వారి నాయకత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పింది చేయను.. చేసేది చెప్పను అన్నట్లు వ్యవహరించే వారు కొందరైతే.. చెప్పింది చెప్పినట్లు చేసి జనం మన్ననలు పొందేవారు మరి కొందరు. ఇందులో మొదటి రకం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే.. రెండో రకం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ముందుగా జగన్ విషయమే తీసుకుంటే.. 2019లో అధికారం చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్ రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను పూర్తిగా మార్చేస్తాననీ, కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించేశారు. అంటే తొలి రెండున్నరేళ్లు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారెవరూ రెండున్నరేళ్ల తరువాత ఉండరనీ, వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రులుగా కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించారు.

అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ శ్లాఘించారు. సాహసోపేత నిర్ణయంగా కీర్తించారు. అలా చేయడం వల్ల మంత్రుల పనితీరే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారని భావించారు. రెండున్నరేళ్లు కాదు.. మూడేళ్లు గడిచిన తరువాత జగన్ చేసింది మంత్రివర్గ  మార్పు కాదు.. పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మరికొందరికి స్థానం కల్పించారు. మొత్తం కేబినెట్ ను మారుస్తానంటూ నాడు చేసిన ప్రకటనను పూర్తిగా మర్చిపోయారు. ఆ మార్పులు కూడా  భయం భయంగా ఎవరిని తొలగిస్తే ఏం సమస్య వస్తుందో అన్నట్లు కసరత్తుల మీద కసరత్తులు, ఒకసారి ఒకరిని అనుకుని కాదు కాదు అంటూ మరొకరి పేరు...ఇలా అంతా గందరగోళం. చివరికి పునర్వ్యవస్థీకరణ చేసినా.. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి. నిరసన ప్రదర్శనలు మొత్తం మీద కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పూర్తయిన నెలల తరువాత కూడా ఇప్పటికీ పార్టీలో అసమ్మతి చల్లారలేదు. మూడేళ్ల ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా తడబాటు. అన్ ప్రిపేర్డ్ నెస్.. ఎవరిని కదిపితే ఏమౌతుందోనన్న భయం. దీంతో జగన్ కేబినెట్ రీషఫుల్ తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసమ్మతి రాగాలు శ్రుతి మించాయి. నిరసనలు పరిధి దాటాయి.

నెలలు గడుస్తున్నా కొత్త మంత్రులు పూర్తిగా కుదురుకోలేదు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతోనే ఆ పార్టీ బలహీనతలూ బయటపడ్డాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురై మాజీ లైన వారు సైలెంటైపోయారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన దాఖలాలూ కనిపించడం లేదు. మంత్రులుగా నిత్యం విపక్షంపై విమర్శలతో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలలోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే ఆయన 2004 నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీని విజయ పథంలో నడిపించారు. 2014 ఎన్నికలలో విజయం తరువాత మూడేళ్ల వరకూ కేబినెట్ లో ఎటువంటి మార్పూలూ చేర్పులూ లేవు. ఇప్పడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఉపక్రమించారు. అంతే సీఎంకు సంఘీభావంగా, పునర్వ్యవస్థీకరణకు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనువుగా స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది.

ఈ రోజు అంటే ఆదివారం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సీఎం కొత్త కేబినెట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేశారు. అదీ పార్టీపై పట్టు ఉండటమంటే. ఆయనేం మూడేళ్ల తరువాత మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానని 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో చెప్పలేదు. కానీ ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని తలపెట్టగానే మంత్రులందా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.   స్పీకర్ సహా మంతులంతా   తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు. పార్టీలో కానీ, మంత్రులలో కానీ ఎక్కడా, ఎవరిలోనూ అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం అయిన దాఖలాలు లేవు. అదీ ఒడిశా సీఎం పట్నాయక్ కు, ఏపీ సీఎం జగన్ కూ  తేడా. స్ఫష్టత, విశ్వాసం, విశ్వసనీయతా నవీన్ పట్నాయక్ బ్రాండ్ అయితే.. అస్పష్టత, అయోమయం జగన్ బ్రాండ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.