టెన్త్ పరీక్షల నిర్వహణే కాదు.. ఫలితాల ప్రకటనలోనూ జగన్ సర్కార్ ఫెయిల్

Publish Date:Jun 4, 2022

Advertisement

జగన్ మూడేళ్ల పాలన అంతా తప్పులు చేయడం.. వాటిని సవరించుకోవడంతోనే సరిపోయింది. మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఆఖరికి ఫలితాల ప్రకటన వరకూ అన్నీ తొందరపాటు నిర్ణయాలే.. ఆ తరువాత కోర్టులు అక్షింతలు వేయడం వల్లో.. మంత్రుల జోక్యం వల్లో మళ్లీ నిర్ణయాలు మార్చుకోవడం జగన్ పాలన అంతా ఇదే తంతుగా సాగింది.సాగుతోంది. తాజాగా శనివారం టెన్త్ ఫలితాల ప్రకటన విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షలు పూర్తయిన పాతిక రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేస్తున్నామని విద్యాశాఖ ఘనంగా ప్రకటనలు ఇచ్చేసింది.

ఈ హడావుడిలో టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ, అది కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపులలోనే ప్రశ్నాపత్రాలు వెలుగులోనికి రావడం, లీకేజీకి బాధ్యుడంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీలో కోర్టులో ప్రవేశ పెట్టడం కోర్టు నారాయణకు బెయిలు ఇవ్వడం వంటివన్నీ జనం మరచిపోతారని వైసీపీ భావించింది.  తీరా ఇప్పుడో ఇహనో పరీక్షా ఫలితాలు వెలువడుతాయని విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఫలితాల విడుదల వాయిదా అంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించారురు. విద్యార్థులు నిరాశపడ్డారు.

ఇంతకీ ఫలితాల విడుదల వాయిదాకు కారణమేమిటంటే విద్యాశాఖ మంత్రిగారికి కోపం రావడమేనట. సాధారణంగా టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ ఏపీలో ఈసారి అధికారులు అత్యుత్సాహంతో మంత్రిగారికి ఫలితాల విడుదల గురించిన సమాచారమే అందించలేదట. విద్యాశాఖాధికారే ఫలితాల విడుదలకు రెడీ అయిపోయారట. చివరి నిముషంలో విషయం తెలిసిన మంత్రి బొత్స అగ్గిమీద గుగ్గిలం అయిపో్యి సదరు విద్యాశాఖాధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫలితాల విడుదల వాయిదా పడిందట.

ఇక సోమవారం ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ 4 అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో  విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం టెన్షన్ తో ఎదురు చూశారు. చివరి నిముషంలో వాయిదా ప్రకటన రావడంతో అందరూ డీలా పడిపోయారు.  మొత్తానికి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణే అంటే నిర్వహించిన పరీక్షల ఫలితాల విడుదలలోనూ అపహాస్యం పాలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప

రీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫలితాల ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరి నిముషంలో వాయిదా వేయడంతో పరీక్షలు రాసిన పిల్లల వారి తల్లిదండ్రులూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధపడ్డారంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

 ఏది ఏమైనా టెన్త పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్ని విషయాలలోనూ జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలయ్యిందని లోకేష్ విమర్శించారు. ఇక టెన్త్ ఫలితా విడుదల ప్రహసనంలో బొత్స కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని దక్కించుకున్నా ప్రమోషన్ ఆశించిన బొత్సకు డిమోషన్ దక్కడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారని అంటున్నారు. ఆ కారణంగానే విద్యాశాఖ విషయాలను అసలు పట్టించుకోవడం లేదనీ, ఆ కారణంగానే అధికారులు ఆయనతో సంప్రదించకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే టెన్త్ ఫలితాల ప్రకటన చేసేశారనీ, చివరి నిముషంలో బొత్స రంగ ప్రవేశం చేసి అధికారులపై కోపంతో చిందులు వేసి ఫలితాల విడుదలను వాయిదా వేశారనీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మంత్రిగారికి కూడా సమాచారం ఇవ్వకుండా ఫలితాల విడుదల ముహూర్తాన్ని అధికారులు తమంత తాముగా నిర్ణయించి ఉంటారా అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు లేదనే చెబుతున్నారు. అధికారులు అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరనీ, ఈ నిర్ణయం వెనుక జగన్ అనుమతో, ప్రోత్సాహమో కచ్చితంగా ఉండి ఉంటుందనీ అంటున్నారు. విద్యాశాఖ విషయాలలో మంత్రి బొత్స పట్టించుకోవడం లేదని జగన్ కు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలోనే బొత్స విషయం మరచి పోయి మీరు పని కానిచ్చేయండి ప్రోత్సహించడంతోనే అధికారులు ఫలితాల ప్రకటనను ముహూర్తం నిర్ణయించి ప్రకటించేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టెన్త్ ఫలితాల  విడుదల, వాయిదాల ప్రహసనంతో పార్టీలో, కేబినెట్ లో ఆఖరికి తన మంత్రివర్గ సహచరులలో కూడా బొత్స ప్రతిష్ట, పరపతి క్షీణించాయని అర్ధమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.