లడాయిలు తప్పనిసరి!

Publish Date:Sep 12, 2012

Advertisement

 

ఏ పార్టీ అయినా అప్పుడప్పుడు ఆ పార్టీలోని కొందరివల్ల ఇబ్బందులు పడకతప్పదు. అది తప్పనిసరి. కాని కాంగ్రెస్‌పార్టీలో మాత్రం ప్రతి విషయంలోను నాయకుల మధ్య లడాయిలు తప్పవు. అసలు లడాయిలు లేందే ఆ పార్టీలోని నాయకులకు అస్సలు తోచనే తోచదు! పబ్లిసిటీ కోసం కూడా లడాయిలు సృష్టించుకుంటారనడం సత్యదూరమేంకాదు! ఇటీవల లేక్‌వ్యూ అతిథి గృహంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ అజాద్‌ను పెద్దపల్లి ఎం.పి. వివేక్‌, విజయవాడ ఎం. లగడపాటి కలిశారు.

 

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమని కనుక ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని వివేక్‌ కోరగా, లగడపాటి తెలంగాణా ఇస్తేనే కాంగ్రెస్‌ నష్టమని అనడంతో వివేక్‌, లగడపాటి మధ్య లడాయి ప్రారంభమై తెలంగాణా విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారని, విజయవాడ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటని వివేక్‌ అంటే, పెద్దపల్లిని రాజధానిగా చేసి తెలంగాణా రాష్ట్రం ఇస్తే తమకేమి అభ్యంతరం లేదని లగడపాటి ఎద్దేవా చేసినట్లు తెలిసింది. దీని బట్టి ఏం అర్ధమయిందయ్యా అంటే ఏ విషయంలోనైనా ఆ పార్టీలో లడాయిలు లేందే పొద్దుపోదు. లడాయిలు లేంది పార్టీ లేదు, లడాయిలంటే ఇష్టపడని నాయకులు ఈ పార్టీలో మమేకం కాలేరని అర్ధమవుతోంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.