తిరుపతిలో ఫలిస్తున్న కిరణ్ 'ఐ'క్యత మంత్రం ?
Publish Date:May 23, 2012
Advertisement
తిరుపతి అసెంబ్లీ సమీకరణాలను మార్చే మంత్రం సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపెట్టేశారు. అదేంటో కాదు 'ఐ'క్యత అని వెలుగులోకి వచ్చేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఐక్యత ఈ నియోజకవర్గంలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది.ఒకానొకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అని, సైకిల్ యాత్రకు శుభారంభమిచ్చిందని, చివరికి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి వేదిక ఇదేనని ఈ నియోజకవర్గం గురించి పలురకాలుగా చెప్పుకున్నారు. కానీ,ఈసారి మాత్రం సిఎం కిరణ్ పాటించిన పార్టీలో ఐక్యతామంత్రం ఒకరకంగా సమీకరణలను మార్చిందనే చెప్పాలి. సిఎం కిరణ్ తండ్రి అమరనాథ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. అయితే కిరణ్ సిఎం అయినప్పుడే తనకు మంత్రి పదవి రాదని నిర్ధారించుకుని పెద్దిరెడ్డి అధిష్టానానికి కిరణ్ పై ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఈ ఉప ఎన్నికలు ప్రారంభసమయంలోనేసిఎం సమీకరణలు మార్చుకుంటూ వచ్చారు. టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ విజయానికి సమైక్యతా బాణం వదిలారు. దీంతో ప్రారంభమైన సమీకరణలు చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ తిరిగాయి. ఆయన్ని కూడా ఆహ్వానించాలని సిఎం ఆదికేశవుల నాయుడుని కోరారు. పెద్దిరెడ్డి పార్టీ అభ్యర్థి విజయానికి తన వంతు కృషి చేస్తానని ఐక్యతా మంత్రాన్ని బలోపేతం చేశారు. దీంతో అప్పటికే తన కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు రాలేదని దూరంగా వెళ్లిన మంత్రి డికె అరుణను బుజ్జగించే పని ప్రారంభమైంది. చివరికి ఆమె కూడా కొంచెం మెత్తబడి పార్టీ ప్రచారానికి రాకపోయినా పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. సిఎం వెనుక ఉండి తెరపై ఆదికేశవుల నాయుడును అన్ని సమీకరణలకు వాడుకున్నారు. చిట్టచివరిగా సమీకరణాల్లో ఉత్సాహం పాల్గొన్న సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని కూడా కాసేపు పక్కన పెట్టి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తిరపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకరరెడ్డి దగ్గరకు తన ముఖ్యమైన వారిని పంపించారు. శంకరరెడ్డి 25ఏల్లుగా తెలుగుదేశం క్రియాశీలక నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మంచి ప్రజాబలం ఉందన్న నమ్మకంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా టిక్కెట్టు ఇచ్చారు. ఆ తరువాత బాబుతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం నాయకులు బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, ఎంపి శివప్రసాద్ కూడా శంకరరెడ్డితో చర్చలు జరిపారు. అయితే సిఎం కిరణ్ స్వయంగా ఆహ్వానించటమే కాకుండా ఖచ్చితంగా మంచి మద్దతు కూడగట్టాలని శంకరరెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడాశంకరరెడ్డి గురించి ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తే నేను మాట్లాడుతాలే అని ఆయన వారికి భరోసా ఇచ్చారు. చివరికి సిఎం స్వయంగా పిలచినందున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానని శంకరరెడ్డి ప్రకటించారు. ఇలా చూసుకుంటే మొదట ఆదికేశవుల నాయుడుతో మొదలుపెట్టి చివరికిశంకరరెడ్డి వరకూ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతే రేపు నియోజకవర్గ చరిత్ర మారుస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు. నిజాయితీ పరుడైన తమ పార్టీ అభ్యర్థి చెదలవాడ కృష్ణమూర్తి కూడా గెలుపుగుర్రం ఎక్కేస్తారని తెలుగుదేశం నాయకులు తమ ప్రచార పంథాను లెక్కించుకుని నమ్మకంగా ప్రకటిస్తున్నారు. వీరిద్దరూ కాదు విజయం మాదంటే మాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డి,బిజెపి అభ్యర్థి మధుసూదన్ చెబుతున్నారు. ఏదేమైనా 'ఐ'క్యతా మంత్రం ఎంత వరకూ పని చేస్తుందో ఫలితాల్లోనే తేలాలి. తన మంత్రం ఫలిస్తోందని,రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అనుయాయులు కూడా తమకే మద్దతు ఇస్తున్నారని సిఎం ధీమాగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/congress-ap-by-polls-24-14247.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





