వివేకానంద రెడ్డి కన్నీటికి కారణమేంటి?
Publish Date:May 23, 2012
Advertisement
నేను బతికి ఉన్నంతకాలమూ కాంగ్రెస్ వాదిగానే మిగిలిపోతానన్న నాటి మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట తప్పారు. ఆయన కూడా ఆ కుటుంబవారసుడనిపించుకున్నారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఎన్నికల్లో తన వదినగారు విజయమ్మపై గెలవలేక మంత్రి పదవిని చివరికి అన్నింటినీ వదులుకుని ఒంటరిగా మిగిలిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తమ వారసుడు జగన్ తో కలిసి నడవబోతున్నారు. తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి దూరమయ్యానని, అయితే దుందుడు స్వభావం ఉన్న ఆయన తన అన్న వైఎస్ ను ఒక్కమాట అన్నందుకే శాసనసభ సాక్షిగా చేయిచేసుకున్నారు. ఇప్పుడు అందరూ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తుంటే ఏమీ చేయలేక ఆయన జగన్ పంచన చేరుతున్నారు. చంద్రబాబు అవినీతి పరుడని గొంతెత్తి చాలా గట్టిగా అరిచిన వైఎస్ తన కుమారుడు సహాయంతో అక్రమంగా సంపాదించారన్న విమర్శ తనను ఎక్కువ బాధించిందని వివేకానందరెడ్డి సన్నిహితులతో అన్నారట. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన అన్న రాజశేఖరరెడ్డిమరణానంతరం కూడగట్టుకున్న అపప్రద జీర్ణించుకోలేక పోతున్నానని వివేకా కన్నీరుపెట్టుకున్నారట. వదిన చేతిలో ఓటమి పాలైనందువల్లే తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని గ్రహించిన ఆయన తననూ విమర్శకులు వదలరని ఎప్పుడో గుర్తించారు. తన అన్న రాజశేఖరరెడ్డిని తిట్టినట్టే తననూ తేడితే మాత్రం తప్పేముందిలే అని ఆయన ఇప్పుడు అన్నింటికీ తెగించారు. దీంతో ఎటువంటి గడ్డుపస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే జగన్ వెనుక నడుస్తానంటున్నారు. ఏదేమైనా కష్టం వచ్చినప్పుడు నిలబడే వాడే బంధువు అని నిరూపించుకునేందుకు వైఎస్ వివేకా నడుం కట్టారు. అన్ని పార్టీలు తనను కూడా టార్గెట్ చేసినా పర్వాలేదు కానీ, ఒక్క జగన్ తనను నమ్మితే చాలనుకుంటున్నానని వివేకా సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే వివేకా పార్టీ మారటం భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పదవి కోసం జగన్ ను లొంగదీసుకునేందుకూ వెనుకాడని వివేకా గెలిచి ఉంటే తన వైపు వచ్చి ఉండేవాడా అని అని జగన్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఏమైనా బాబాయిలో వచ్చే మార్పు తమకు అనుకూలంగానే ఉంటుందని జగన్ వారికి సర్దిచేప్పారట. తనకు అందించిన నివేదికల ప్రకారం వివేకానందరెడ్డి తన సాన్నిహిత్యం కోరుకుంటున్నాడని జగన్ గ్రహించినట్టే ఉండి. అందుకే వివేకాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తన సిబిఐ హడావుడి ముగిసేంత వరకూ బాబాయి సాయం అందిస్తే ఆ తరువాత పార్టీని నడపటం నల్లేరుపై నడకలాంటిదని కూడా జగన్ అనుకుంటున్నారని తెలిసింది. వేరువేరు ఆలోచనలతో కలుస్తున్న ఈ బాబాయ్ - అబ్బాయ్ యవ్వారం ఎలా ఉంటుందో మాత్రం భవిష్యత్తులో తెరపైనే చూడాలని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది.
http://www.teluguone.com/news/content/ys-viveka-to-join-ysrcp-24-14246.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





