Publish Date:Oct 30, 2012
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తెలంగాణపై దృష్టి సారించారు. కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతలు సోమవారం తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొన్నారు. ఆయన మరో రెండురోజులు జిల్లాలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం వాయిదా పడటంతో మెదక్ జిల్లాకు వెళ్ళారు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 2న అనంతపురం జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి, కర్నూలు జిల్లా మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో బాబు యాత్ర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. విజయమ్మ సమక్షంలో జిట్టా పార్టీలో చేరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-24-18729.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.