జగన్వల్ల కాంగ్రెస్ బలహీన పడుతోంది :రాఘవులు
Publish Date:Feb 1, 2012
Advertisement
ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పటికే ముఠా కుమ్ములాటల్లో మునిగి పోయిందని,వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల అది మరింత బలహీన పడుతోందని తద్వారా రాష్ట్రానికి కాంగ్రెసు పీడ వదిలి పోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకమని, ఈ విషయంలో ఇప్పటికే మేం స్పష్టత ఇచ్చినందువల్ల ప్రజలు తమను నమ్ముతున్నారన్నారు. తాము తెలుగుదేశం పార్టీకి దగ్గరగానో లేదో దూరంగానో లేమన్నారు. 2009 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఎవరికి వారం ఉద్యమిస్తున్నామని చెప్పారు. ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఉండదల్చుకోలేదన్నారు. ప్రధాన పార్టీలు ఇబ్బందుల్లో ఉన్నందున కమ్యూనిస్టు పార్టీలు పుంజుకుంటాయన్నారు. పార్టీ గడ్డుకాలంలో తాము మహా సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఏం చేయలేక పోయామన్నారు. ప్రజా సమస్యలపై మరింత ఉద్యమిస్తామన్నారు. రాబోయే రోజులు కమ్యూనిస్టులవేనని ఆయన అన్నారు. 2014లో జగన్ భవితవ్యం ఎలా ఉంటుందో జోస్యం చెప్పలేమన్నారు.
http://www.teluguone.com/news/content/congress-24-11503.html





