కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారే : సీఎం రేవంత్

Publish Date:May 28, 2026

Advertisement

 

ఎన్టీఆర్ ప్రాంతీయ నేత కాదు..యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ..

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున దివంగత ముఖ్యమంత్రి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది స్వయంగా అన్న ఎన్టీఆరేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అలాంటి మహోన్నత నాయకుడి నీడన పెరిగి, ఈ రోజు ఆయనపైనే విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన నేత కాదని, ఆయన యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ అని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని పెట్టడంపై వస్తున్న విమర్శలను రేవంత్ తీవ్రంగా ఖండించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగానే మైత్రీవనంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించామని, ఒక ముఖ్యమంత్రిగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలగడం తన జీవితకాల మధురజ్ఞాపకమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంలో తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

తెలంగాణ సమాజానికి, రాజకీయాలకు ఎన్టీఆర్ చేసిన మేలును రేవంత్ రెడ్డి కొనియాడారు. నాడు పాత పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది అన్నగారేనని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, మాధవరెడ్డి వంటి దిగ్గజ నాయకులను తయారు చేసింది ఎన్టీఆర్ కాదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని శ్లాఘించారు.

ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా ఇందిరాగాంధీ ఆశీస్సులు, ఎన్టీఆర్ ఆశయాల కలయికతోనే సాగుతోందని సీఎం వివరించారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకాలే.. నేటి సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరల పథకాలకు పునాదులని పేర్కొన్నారు. నాడు ఇందిరమ్మ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం శ్రమిస్తే.. ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల (బీసీ) అభ్యున్నతికి తోడ్పడ్డారని, వారి వల్లనే నేడు ఆయా వర్గాల వారు పాలకులుగా ఎదిగారని రేవంత్ తెలిపారు.

తెలంగాణలో రాబోయే పదేళ్లూ కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని, హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన తరహాలోనే.. తమ ప్రభుత్వం సుమారు 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మించి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలుపుతుందని రేవంత్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
 

By
en-us Political News

  
వారు ప్రయాణిస్తున్న అధికారిక టీమ్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, భద్రతా సిబ్బంది వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి.. అందులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరినీ సురక్షితంగా కిందికి దించేశారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
దేశంలోని మిలిటరీ శక్తులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ) కమాండర్లు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని, కీలక నిర్ణయాల నుండి దేశ అధ్యక్షుడిని, రక్షణ రంగానికి చెందని పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆ లేఖలో పెజెష్కియాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
అందరి దృష్టిని ఆకర్షించింది కింగ్ కోహ్లీ, అనుష్క జంట. ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా షేర్ చేసిన వీడియోలో విరుష్క (విరాట్ కోహ్లీ, అనుష్క) జంట కలిసి వేసిన అదిరిపోయే డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం.
ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు.
దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.
బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు, మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 దూకుడుగా ఆడాడు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.