విరుష్క డ్యాన్స్ అదరగొట్టారుగా?
Publish Date:Jun 1, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (మే 31) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ శిబిరంలో పండగ వాతావరణం నెలకొంది. మైదానంలో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవ్వగా, స్టేడియం వెలుపల జరిగిన అధికారిక సక్సెస్ పార్టీలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించింది కింగ్ కోహ్లీ, అనుష్క జంట. ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా షేర్ చేసిన వీడియోలో విరుష్క (విరాట్ కోహ్లీ, అనుష్క) జంట కలిసి వేసిన అదిరిపోయే డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి మ్యాచ్‌లోనూ గ్యాలరీలో ఉంటూ ఆర్సీబీని అమితంగా ప్రోత్సహించే అనుష్క శర్మ, ఈ చారిత్రక విజయం తర్వాత నేరుగా జట్టు సంబరాల్లో పాలుపంచుకుంది. పార్టీ హాల్‌లోని డ్యాన్స్ ఫ్లోర్‌పై ఈ స్టార్ కపుల్ కలిసి డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ, నవ్వులు చిందిస్తూ వారు వేసిన డ్యాన్స్ మూవ్స్ ప్యూర్ వైబ్స్ అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ప్రశంసలు గుప్పిస్తున్నారు. అనుష్క శర్మ స్టైలిష్ బూట్-కట్ జీన్స్‌లో మెరిసిపోగా, విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ-షర్ట్, షార్ట్స్ ధరించి చాలా క్యాజువల్‌గా కనిపించాడు.ఈ వేడుకల్లో కోహ్లీ ధరించిన టీ-షర్ట్‌పై ఉన్న ఒక ఆసక్తికరమైన మెసేజ్ నెటిజన్ల విపరీతంగా ఆకట్టుకుంది. (వన్ ఫెల్ట్ నైస్, వి డిడ్ ఇట్ ట్వైస్) ఒకసారి గెలిస్తే బాగుంది అనిపించింది.. కానీ మేము రెండుసార్లు చేసి చూపించాం అని రాసి ఉంది. ఆర్సీబీ బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొటేషన్ డిజైన్ చేశారు. కేవలం అనుష్కతోనే కాకుండా, మైదానంలో అద్భుతాలు సృష్టించిన ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌తో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశాడు. అంతేకాదు.. ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాతో కలిసి డోలు వాయిద్యాల మోతకు అనుగుణంగా విరాట్ వేసిన క్రేజీ స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. క్రునాల్ పాండ్యా ఐపీఎల్ ట్రోఫీని చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే, కోహ్లీ పక్కనే చేరి సందడి చేశాడు. ఆ సమయంలో అనుష్క శర్మ తన మొబైల్ ఫోన్ తీసి భర్త కోహ్లీ సంబరాలను ఎంతో మురిపెంగా రికార్డ్ చేస్తూ బిగ్గరగా నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
http://www.teluguone.com/news/content/virushka---rock-the-dance-floor-36-221389.html





