సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Publish Date:Jun 24, 2026

Advertisement

 

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం, అనంతరం మృతదేహాన్ని మాయం చేసిన కేసులో మాజీ సీఐ సూడా సురేష్ వీర వెంకట నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు నమోదయ్యాయి.

రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సాయికృష్ణపై కృష్ణలంక, మాచర్ల పోలీస్ స్టేషన్లలో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 మే మొదటి వారంలో మార్కాపురం వద్ద అతడిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మే 6న తెల్లవారుజామున సీఐ నాగరాజు సాయికృష్ణను తన కస్టడీలోకి తీసుకున్నారు. చట్టప్రకారం 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, అక్రమంగా లాకప్‌లోనే ఉంచినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సాయికృష్ణను పోలీసులు పట్టుకున్న విషయం తెలుసుకుని అతని తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, గాయాలతో లాకప్‌లో ఉన్న తన కుమారుడిని చూసినట్లు, లోపల నుంచి కేకలు వినిపించినట్లు ఆమె వాంగ్మూలంలో నమోదు చేశారు. కుమారుడిని విడిచిపెట్టాలని వేడుకున్నా సీఐ నాగరాజు ఆమెను దూషించి, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. స్పృహ లేని స్థితిలో ఉన్న సాయికృష్ణ కాళ్లకు తాడు కట్టి స్టేషన్‌లోనే హింసించినట్లు దర్యాప్తులో నమోదు చేశారు. ఈ హింస కారణంగానే మే 6 నుంచి మే 8 మధ్యకాలంలో సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కస్టడీలో మరణం అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించి, ఆధారాలు లభించకుండా తగులబెట్టి పూర్తిగా మాయం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా తొలగించినట్లు రిపోర్టులో వెల్లడైంది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ రికార్డులను సైంటిఫిక్ అసిస్టెంట్ పరిశీలించగా ఎలాంటి డేటా లేకుండా పూర్తిగా డిలీట్ చేసినట్లు గుర్తించారు. 

అలాగే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో కూడా సాయికృష్ణ తమ కస్టడీలో లేడంటూ తప్పుడు సమాచారం సమర్పించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 19న విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో మాజీ సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 127(4) (అక్రమ నిర్బంధం), 127(6), 103(1) (హత్య), 238 (సాక్ష్యాల ధ్వంసం) కింద కేసు నమోదు చేశారు. .కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న ఐజీపీ ఎం. రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 

బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్ దర్యాప్తు అధికారిగా బాధ్యతలు స్వీకరించి మాజీ సీఐ నాగరాజును అరెస్టు చేశారు. జూన్ 24న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా నిందితుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసు పోలీస్ కస్టడీ హింస, హత్య, శవాన్ని మాయం చేయడం, సాక్ష్యాల ధ్వంసం వంటి అత్యంత తీవ్రమైన అంశాలకు సంబంధించినదని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితుడు దర్యాప్తుకు సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అతడు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని దర్యాప్తు అధికారి కోర్టును అభ్యర్థించారు.
 

By
en-us Political News

  
డిగ్రీ లేకుండానే ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ సింగ్..
తమిళనాడు సీఎం విజయ్ ఉదారత..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
హైదరాబాద్ నగరంలో గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్..
నాగరాజు ఉండటం వల్లే తమ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల ఆగడాలు అణచివేయబడ్డాయని, తాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసలేం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందన్న విషయంపై ప్రముఖ విశ్లేషకుడు సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్టాడారు.
షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ.. నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది.
సాధారణంగా పుట్టిన బిడ్డకు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే అదే సంప్రదాయాన్ని ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.