Publish Date:Oct 10, 2019
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయ ప్రముఖులు కూడా సైరాను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి నారా లోకేష్ వంటి వారు సైరాపై ప్రశంసల వర్షం కురిపించారు.
మరోవైపు చిరంజీవి సినీ రాజకీయ ప్రముఖుల్ని కలిసి సైరా చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి సైరా చిత్రం చూడమని కోరనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. మరి జగన్ కు సైరా చూసే తీరిక దొరుకుతుందో లేదో తెలియదు కానీ.. చిరంజీవి ఆయనతో భేటీ కాబోతున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరోవైపు చిరంజీవి జగన్ తో భేటీ అంటున్నారు. దీంతో మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. అయితే దీని వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. సైరాకు ఏపీలో అదనపు షోలు కావాలని మంత్రి కన్నబాబు ద్వారా చిరంజీవి అడిగిస్తే.. జగన్ అంగీకరించారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా జగన్ ని కలిసి, కృతఙ్ఞతలు తెలిపి, సైరా వీక్షించాల్సిందిగా కోరనున్నారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-to-meet-ap-cm-ys-jagan-25-89937.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!