బొత్స ప్రయత్నాన్ని తిప్పికొట్టిన కిరణ్
Publish Date:Jan 3, 2012
Advertisement
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని చేరువ చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిక్యత సంపాదించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన మరో ప్రయత్నం బెడిసిపొట్టినట్లు తెలుస్తోంది.పీఆర్పీకి చెందిన ఏకైక కార్పొరేటర్ నర్శింహయాదవ్కు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టడం ద్వారా చిరంజీవిని మరింత దగ్గర చేసుకోవాలని బొత్స ప్రయత్నించినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి తన పార్టీకి చెందిన కార్పొరేటర్ నర్శింహయాదవ్కు ఇవ్వాలని సిఫారసు చేశారు. దానికి అంగీకరించిన బొత్స యాదవ్‌కు డిప్యూటీ ఇప్పిస్తానని చిరంజీవికి గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నాగేందర్, ముఖేష్, ఇతర నగర నాయకులతో మంతనాలు జరిపారు. చివరకు ముఖ్యమంత్రి కిరణ్ వద్దా తన మనోగతం వెల్లడించారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలివిగా వ్యవహరించారు. అయితే బొత్స సత్యనారాయణ ఎత్తుగడను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిప్పికొట్టారు. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌ను తెరపైకి తీసుకువచ్చి, ఆయన వర్గానికి చెందిన కార్పొరేటర్‌కు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టారు. తద్వారా బొత్స సత్యనారాయణ ప్రయత్నాలను ఆయన అడ్డగించారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-24-10577.html





