విదేశాలల్లోనూ అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ వేడుకలు.....

Publish Date:Oct 5, 2019

Advertisement

 

దసరా వచ్చిందంటే చాలు ముందుగా మనకు గుర్తోచ్చేది బతుకమ్మ.తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటూ పెద్ద వేడుకగా చేసుకుంటారు.తెలంగాణ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలోనూ లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్, స్థానిక హౌన్సలో మేయర్ టోని లౌకీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపధ్యంలో అదే స్ఫూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూత నిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలనూ చేనేత బతుకమ్మ మరియు దసరాగా జరుపుకున్నామని సంస్థ వ్యవస్ధాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఇక తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని మరియు స్ఫూర్తిని ఇచ్చిందని వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్స్ ఇన్ చార్జ్ రత్నాకర్ కుడుదుల తెలిపారు. కల్చరల్ ఇన్ చార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమంలో చేనేత శాలువాలను ఒకరికొకరు పరస్పరం వేసుకొని జమ్మీన్ ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుని చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి అలాయి బలాయిలా తెలంగాణ స్నేహ మాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మహిళలందరు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో కోలాటాల నృత్యాలతో చప్పట్లు కలుపుతూ రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులందరి ప్రశంసలందుకుంది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేలా వినూత్నంగా ఇలా ఏదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని గత ఏడాది చార్మినార్ ఏర్పాటు చేసామని కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు.

విదేశాల్లో స్థిరపడ్డ కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటలలో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రజలంతా పాల్గొనాలనే, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ గారు చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించటమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజలలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిధులు మరియు ప్రవాసులంతా ఐ ప్లజ్ టూ సపోర్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్  అనే సెల్ఫీ స్టాండ్ తో ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత హై కమిషనర్ ప్రతినిధి రాహుల్ తో పాటు ప్రవాస సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం వినూత్నంగా ఉందని వీరి ప్రయత్నం ఫలించి చేనేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశ ప్రజలు విదేశాలల్లో మన పండుగలను పూర్తిగా జరుపుకోలేకపోతున్నారనే అసంతృప్తిని వైదోలగించి ఇలాంటివాటిని ప్రోత్సహించడం వల్ల భారతీయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.