హరిలో రంగ హరి ... జోగయ్య సంగతి
Publish Date:Apr 1, 2012
Advertisement
పార్లమెంట్ మాజీ సభ్యుడు చేగొండి హరిరామయ్య జోగయ్య ఓ విచిత్రమైన వ్యక్తిత్వం గల సీనియర్ రాజకీయ నాయకుడు. చెప్పాలనుకున్న విషయం తప్పయినప్పటికీ సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు అది తప్పు కాదు ఒప్పేనని చెబుతారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధినాయకత్వానికి జోరీగలా మారతారు. తనకిష్టమైనప్పుడు అధినాయకులను ఆకాశానికి ఎత్తేస్తారు. ఇష్టం లేకపొతే వారిపై బురదజల్లెస్తారు. గతంలో దాసరి నారాయణరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి తదితర హేమా హేమీలంగా జోగయ్య బురద రాజకీయాలకు బలైనవారే. చిరంజీవి ప్రజారాజ్యం పాటీ పెట్టడంలో జోగయ్య కీలకపాత్ర వహించారు. ఆ పార్టీలో నెంబర్ టూ, నెంబర్ త్రీ స్థానం జోగయ్యదే అంటూ ప్రచారం జరుగుతున్నా సందర్భంలో హఠాత్తుగా ఆయన ప్లేటు మార్చారు. చిరంజీవి అసమర్థుడని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పెద్ద అవినీతిపరుడుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ అవినీతిపరుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పంచన చేరారు. భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్లేషించారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తాను మద్దతు పలుకుతున్నానని అంటున్నారు. మరి గతంలో వై ఎస్ ఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు ప్రకటనలు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే తాను ఆరోపణలు చేసిన మాట నిజమేనని, కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వై ఎస్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని అంటూ ఆయన తనను తాను సమర్థించుకుంటున్నారు. గతంలో చిరంజీవి కూడా ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు కదా అని ప్రశ్నిస్తే నేను కోరుకున్న మాట నిజమేనని, అయితే ప్రజలు ఆయనను తిరస్కరించారని ఇందులో నా తప్పేమీ లేదని జోగయ్య చెబుతారు. ఇప్పుడు జగన్ కు జేజేలు కొడుతున్న జోగయ్య కొంతకాలం పోయిన తరువాత జగన్ కు ఛీ ఛీ లు కొట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు.
http://www.teluguone.com/news/content/chegondi-harirama-jogaiah-24-13068.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





