ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పొరెల్ పై చీటింగ్ కేసు

Publish Date:Jun 24, 2026

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్  వికెట్ కీపర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ పై చీటింగ్ కేసు నమోదైంది.  మైదానంలో పరుగుల వరద పారించే ఈ 23 ఏళ్ల యువ క్రికెటర్..  పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో సహజీవనం చేసి,  నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు  పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా మోగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై   కేసు నమోదైంది. ఈ వార్త క్రికెట్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో  హాట్ టాపిక్‌గా మారింది.

బాధితురాలైన   వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో  అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి  చేసుకోవాలని  నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కాగా గత  ఏడాదిన్నరగా వారి   మధ్య  విభేదాలు తలెత్తాయని, అప్పట్లోనే ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినప్పటికీ, ఆ సమయంలో కేసు నమోదు కాలేదని సమాచారం. అయితే.. ఇప్పుడు ఆ విభేదాలు మరింత ముదరడంతో పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ పొరెల్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

ఇలా ఉండగా.. అభిషేక్ పొరేల్ ఈ ఆరోపణలను ఖండించాడు.    ఐపీఎల్ 2025 సీజన్‌లో స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ  ఇచ్చిన అభిషేక్ పొరేల్.. ఆ సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ,  ఢిల్లీ కేపిటల్స్ అతడిని రిటైన్ చేసుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐపీఎల్ 2026  సీజన్‌లో అద్భుతంగా రాణించి జట్టులో  కీలక ఆటగాడిగా ఎదిగాడు. హూగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌కు చెందిన ఈ యువ క్రికెటర్, కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలోనే  మోసం కేసు నమోదు కావడం అతడి ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా కెరీర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంటున్నాయి.  

By
en-us Political News

  
సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ కు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది. అరవ్ హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.
సాధారణంగా దూకుడుగా ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒకింత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. లూజ్ బాల్ వచ్చే వరకూ వెయిట్ చేశాడు. స్టాల్ సెలక్షన్ కూడా సెలక్టివ్ గా ఉంది. లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలిస్తూ.. మంచి బంతులకు గౌరవం ఇస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు.
అలల తాకిడికి వారిలో ముగ్గురు సముద్రంలో మునిగి మరణించారు. మృతులను 23 ఏళ్ల అరవింద్, 17 ఏళ్ల శ్రీరామ్, సాయిగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం వేళ సముద్రంలో అలల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగిపోయింది. చూస్తుండగానే సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భారీ అలల తాకిడికి ఈ ముగ్గురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు.
ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతూ.. జట్టులో స్ధానమే అనుమానమన్న రీతిలో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రోహిత్, మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ఈ శతకంతో రోహిత్ శర్మ క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అ . ఇది రోహిత్‌కు 34వ వన్డే సెంచరీ కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.