జగన్ హయాంలో గ్రూప్ 1 స్కామ్.. అలాంటిది ఎన్నడూ చూడలేదు.. మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు.!

Publish Date:Aug 17, 2026

Advertisement

జగన్ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాలలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధ్వజమెత్తారు. అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడయాతో చిట్ చాట్ గా మాట్లాడిన చంద్రబాబునాయుడు.. గత పాలకుల స్వార్థ ప్రయోజనాలు, నిబంధనల ఉల్లంఘన కారణంగా   వేలాది మంది మెరిట్ విద్యార్థులు అన్యాయానికి  బలయ్యారన్నారు. 

 గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై     ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెలికితీసిన ఆధారాల వివరాలను ప్రజలందరికీ స్పష్టంగా తెలిసేలా శాసనసభ వేదికగా సమగ్రంగా చర్చిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్1 పరీక్షల డిజిటల్, మాన్యువల్ రీ-వ్యాల్యుయేషన్ ప్రక్రియలలో నిబంధనలను పక్కనబెట్టి  అక్రమాలకు పాల్పడినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తు తేల్చిందన్నారు. అర్హులైన నిపుణులైన అధ్యాపకుల చేత కాకుండా కాంట్రాక్ట్ సిబ్బంది, ఇతర అనర్హుల చేత మూల్యాంకనం చేయించడం, ఓఎంఆర్ షీట్ల మార్పిడి వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశాయన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ద్వారా అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు ఎంపికయ్యారని, వారికి ఈ నియామక ప్రక్రియతో ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉందన్నారు. తమ ఆత్మగౌరవాన్ని, అర్హతను కాపాడుకునేందుకే వారు రోడ్లపైకి వచ్చి మద్దతు తెలపాల్సి వచ్చిందని సీఎం వివరించారు.

గత పాలకులు ప్రభుత్వ వ్యవస్థలను,  నియామక బోర్డులను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ అధికారాలను సైతం పక్కనబెట్టి అర్హత లేని వారికి ఎక్కువ మార్కులు వేసేలా అక్రమాలకు పాల్పడ్డారని విచారణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్న చంద్రబాబు.. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థపై నిరుద్యోగ యువత నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన అన్ని అక్రమాలపై పారదర్శకమైన విచారణ జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉందని ఉద్ఢాటించిన చంద్రబాబు.. నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంతో పాటు అర్హులకే ఉద్యోగాలు దక్కేలా రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు. 
Chandrababu Naidu, AP AssemblyLobby, MediaChit Chat, YCP Group 1 Scam, APPSC Group 1 Evaluation Scam, AP Mega DSC 

By
en-us Political News

  
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.