సభలో నవ్వులు పూయించిన ‘నేషన్ ఫస్ట్’ డైలాగ్..!
Publish Date:Aug 17, 2026
Advertisement
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..! అమరావతి శాసనసభలో రాజకీయ చర్చల మధ్య కాసేపు సరదా వాతావరణం నెలకొంది. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ సభలో నవ్వులు పూయించింది. “జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్య ఒకరు” అంటూ ప్రశంసించారు. ఇంతలో లోకేష్ మరో పంచ్ వేశారు. “మా పార్టీ వారికి కూడా కాస్త క్రమశిక్షణ నేర్పించండి” అంటూ సత్యకుమార్‌ను ఉద్దేశించి అనడంతో సభలో నవ్వులు మరింత పెరిగాయి. అదే సమయంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే “పార్టీ ఫస్ట్” అంటూ కలగజేసుకున్నారు. దీంతో సత్యకుమార్ వెంటనే స్పందిస్తూ.. “నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్” అంటూ తన సమాధానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సత్యకుమార్ చెప్పిన ఈ ఒక్క మాటతో సరదా సంభాషణకు ఆసక్తికరమైన ముగింపు లభించింది. పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముందు అనే సందేశాన్ని ఆయన స్పష్టం చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మరోసారి నవ్వులు వెల్లువెత్తాయి. రాజకీయ వేడి మధ్య సభలో కాసేపు చోటుచేసుకున్న ఈ సరదా సంభాషణ.. సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించింది. Nara Lokesh, Satya Kumar Yadav, AP Assembly, Minister Atchennaidu, TDP BJP Alliance,
మంత్రి సత్యకుమార్‌ను ఉద్దేశించి నారా లోకేష్ సరదాగా మాట్లాడుతూ.. “సత్యకుమార్కి ప్రత్యేకంగా బీజేపీ కండువా అవసరం లేదు.. మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా!” అంటూ చమత్కరించారు. దీంతో సభలో చిరునవ్వులు విరిశాయి. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తనదైన శైలిలో జత కలిశారు.
Andhra Pradesh Politics, Amaravati Legislative Assembly
http://www.teluguone.com/news/content/nara-lokesh-36-229111.html





