బాబులేఖ కప్పదాటు వ్యవహారమే!
Publish Date:Sep 28, 2012
Advertisement
తెలంగాణపై కేంద్రానికి లేఖ రాస్తామంటూ చంద్రబాబు ఊరించి ఊరించి చివరకు ఆ లేఖను చప్పగా తేల్చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! అఖిలపక్షం ఏర్పాటు చేస్తే 2008 నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం. కప్పదాటు వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతానికి బాబు ఇకనైనా స్వస్థి చెపితే మంచిదంటూ సలహా ఇస్తున్నారు. పి.సి.సి. అధ్యక్షుడు బొత్స ఢల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి బాబును విమర్శిస్తే, విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఎం.పి. లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన అంశంపై స్పందించేటప్పుడు అన్ని ప్రాంతాల వారి మనోభావాలనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒక్క తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా సమైక్యవాద ఉద్యమాన్నీ గమనించి లేఖ రాసిఉంటే బావుందంటున్నారు. ఇదిలా ఉంటే` తెలంగాణా విషయంలో ఎటువంటి స్పష్టతా లేకుండా కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం... మధ్యలో మనకు చుట్టుకుంటోందీ పాపం’ అంటూ చంద్రబాబు వాపోతున్నట్లు వార్తలొస్తున్నాయి! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని భరించాల్సిందే కదా!
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-17748.html





