టీడీపీ కమిటీల్లో పల్నాడు జిల్లాకి ప్రాధాన్యం ...వైసీపీలో గుబులు

Publish Date:Apr 17, 2026

Advertisement

 

తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏకంగా ఎనిమిది మందికి అధిష్టానం పదవులు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నెలకొంది. టీడీపీ వారికి లభించిన ప్రాధాన్యత చూస్తూ పల్నాడు వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారిని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక పదవుల్లో నియమించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఇప్పటికే పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా తీసుకోవడంతో పార్టీలో పెద్ద పీట వేసినట్లైంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జాతీయ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

మంత్రి పదవి ఆశించిన ఆ సీనియర్ నేతకు పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జోనల్ కోఆర్డినేటర్‌గా పదవులు దక్కించుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రత్తిపాటి ఈ సారి జోనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే సత్తెనపల్లికి చెందిన మన్నెం శివనాగమల్లేశ్వరారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్ధిగా, పెదకూరపాడు నేత మద్దిరాల గంగాధర్ , చిలకలూరిపేట మైనార్టీ నేత షేక్ కరీముల్లా, వినుకొండ మైనార్టీ లీడర్ షమీమ్‌ఖాన్‌లకు రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు దక్కాయి. 

మద్దిరాల గంగాధర్ పార్టీకి విధేయుల. తన వాక్చాతుర్యంతో అధిష్టానం గుడ్ లుక్స్‌లో  ఉన్న ఆయన ఇప్పటికే రాష్ట్ర నాయీ బ్రాహ్మణ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. షమీమ్ ఖాన్, షేక్ కరీముల్లాలకు కార్యదర్శి పదవులు దక్కడంతో పల్నాడులో గణనీయంగా ఉన్న మైనార్టీలకు ప్రాధాన్యత దక్కినట్లైంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన శివనాగలమల్లేశ్వరరావు గత మూడు సార్లుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టికెట్ రాక పోయినా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రస్థాయి కమటీలోకి తీసుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో వైసీపీ కమిటీలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే జగన్ కొనసాగిస్తున్నారు. 

2024 ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆయన జిల్లా అధ్యక్షుడి ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నికల హింస కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన పిన్నెల్లి పెద్దగా జనంలోకి రావడం లేదు. దాంతో పిన్నెల్లి స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని జిల్లా వైసీపీ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే జగన్ మాత్రం పిన్నెల్లి వైపే చూపుతుండటం, ఆయన కేసుల భయంతో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటంతో జిల్లా వైసీపీకి పెద్దదిక్కు కరువైన పరిస్థితి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం పాలవ్వడం, సమర్ధమైన నాయకత్వం కరువవ్వడంతో అక్కడి కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో పల్నాడు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత పెరుగుతుండటంతో వైసీపీ వర్గాల్లో అంతర్మధనం మొదలైందంటున్నారు.

By
en-us Political News

  
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో విడదల రజినితో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడు పిల్లి కోటి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే న్యాయస్థానం విడదల రజినిని పాస్ పోర్టు సరెండర్ చేయాల్సిందిగా ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.