నేడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ
Publish Date:Dec 18, 2011
Advertisement
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని స్వల్పంగా విస్తరించనున్నారు. ఇటీవల యూపీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత అజిత్ సింగ్‌కు చోటు కల్పించే నిమిత్తం ఈ విస్తరణను చేపడుతున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగే చిన్నపాటి కార్యక్రమంలో అజిత్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ సింగ్ పార్టీకి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఇదిలావుండగా, ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోక్‌పాల్, ఆహార భద్రతా బిల్లులపై కేంద్ర మంత్రి వర్గం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-cabinet-24-10004.html
http://www.teluguone.com/news/content/central-cabinet-24-10004.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





