Publish Date:Apr 16, 2026
ఆంధ్రప్రదేశ్ లో భారత జనగణన-2027 ప్రక్రియ గురువారం (ఏప్రిల్ 16)నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం, చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. తొలి దశలో ఇంటి వివరాల సేకరణ , గృహ గణన పనులు చేపట్టారు. రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అమరావతి సచివాలయంలో బుధవారం (ఏప్రిల్ 15) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
గురువారం (ఏప్రిల్ 16) నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వారి కోసం ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి సమాచారాన్ని సేకరిస్తారన్నారు. డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం కోసం గణన విధుల్లో పాల్గొనే వారిలో 80 శాతం మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉండటం విశేషం. మిగిలిన 20 శాతం విధులను ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి కేటాయించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం నేరుగా డిజిటల్ సర్వర్లలో నిక్షిప్తం కానుంది. ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయనీ, డేటా భద్రతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే.. గణన ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా, అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా జె. నివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన వివరాలు అందించాలని కోరారు.
రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ డేటా ఆధారంగానే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఏపీలో ప్రారంభమైన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఇదే తరహా విధానానికి ఇది ఒక రోడ్ మ్యాప్‌గా నిలిచే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/census-begins-in-ap-36-217469.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.