ఢిల్లీలో సిబిఐ జెడి బిజీబిజీ..ఈ సారి ఎవరు అరెస్ట్
Publish Date:Feb 7, 2012
Advertisement
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ రోజుల క్రితం ఢిల్లీ కి వెళ్లారు. ఆయన ఢిల్లీ పర్యటన కారణంగా ఈసారి అరెస్టు ఎవరిదనే ఊహాగానాలు రాష్ట్రంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన అక్కడ ఉన్నతాధికారులు, తోటి అధికారులతో సమావేశమవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఓ వైపు ఢిల్లీలో బిజీగా ఉండగానే మరోవైపు రాష్ట్రంలో తదుపరి అరెస్టుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో జెడి లక్ష్మీ నారాయణ రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాతే అరెస్టులు జరిగాయి. దీనిని కొందరు ఉదాహరణగా చూపిస్తూ త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాలి గనుల కేసు, జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ ఇప్పటికే గాలి, ఎమ్మార్ కేసులలో ఛార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించింది. జగన్ ఆస్తుల కేసులో మాత్రమే ఛార్జీషీట్ సమర్పించవలసి ఉంది. ఇటీవలి కాలంలో ఈ కేసుల విచారణను వేగవంతం కూడా చేసింది. విజయ సాయి రెడ్డి నుండి మొదలు సునీల్ రెడ్డి వరకు పలువురి అరెస్టులు సైలెంట్‌గానే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిబిఐ జెడి హైదరాబాద్ వచ్చాక అరెస్టుల పర్వానికి మరోసారి తెరలేవ వచ్చునని, అయితే అవి ఎవరివనే ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/cbi-jd-lakshminarayana-24-11688.html





