కర్నాటక అసెంబ్లీలో మంత్రులు అశ్లీల చిత్రాల వీక్షణ

Publish Date:Feb 7, 2012

Advertisement

బెంగుళూరు: కర్నాటక శాసనసభలో మంత్రులై ఉండి, సభలో తీవ్రమైన చర్చ జరుగుతున్నా పట్టించుకోకుండా కామాంధులుగా వ్యవహరించిన ఘనత బిజెపి నేతలకే దక్కుతుంది. మంగళవారం శాసనసభలో అశ్లీల చిత్రాలను వీక్షిస్తూ ఇద్దరు మంత్రులు కెమెరా కళ్లకు దొరికి పోయారు. పురుషులు, స్త్రీలు మధ్య స్నేహమే తప్పని నీతులు చెబుతూ సోషల్‌ పోలీసింగ్‌ పేరుతో యువతీ యువకులపై దాడులు జరిపిన బిజెపి పరివారానికి చట్టసభలో ఉన్నామనే సోయి కూడా లేకుండా పోయింది. బిజాపూర్‌ జిల్లాలో పాకిస్తాన్‌ జాతీయ జెండా ఆవిష్కరణ, తదనంతరం ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం శాసనసభలో చర్చ చోటుచేసుకుంది. ఈ సమయంలో సభలోనే ఉన్న మంత్రులు లక్ష్మన్‌ సావడి, సిసి పాటిల్‌ చర్చను పట్టించుకోకుండా తమ సెల్‌ఫోన్‌లో ఆశ్లీల చిత్రాలు చూస్తున్న దృశ్యం సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో ప్రసారం అయ్యాయి. తమ మంత్రులు అడ్డంగా దొరికిపోవడంతో ఏమి చెప్పాలో తెలియక బిజెపి నేతలు దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే స్పీకర్‌ బోపయ్య మాత్రం మంత్రుల చర్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సౌదీ అరేబియాలో ఓ మహిళపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన వార్తను వారు తమ సెల్‌పోన్‌లో వీక్షించారని ఆయన పేర్కొంటున్నారు. కాగా ఈ అంశంపై సంబంధిత మంత్రులను సంప్రదించేందుకు మీడియా విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజని మాజీ సిఎం, జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామి విమర్శించారు. ఇప్పటికే అక్రమ మైనింగ్, లోకాయుక్త తదితర సమస్యల్లో ఇరుక్కున్న బిజెపికి ఇది మరో దెబ్బ.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.