లగడపాటిపై కోదండరాం ఆరోపణలు
Publish Date:Feb 7, 2012
Advertisement
హైదరాబాద్: కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలార్ ఎనర్జీ కుంభకోణంలో లగడపాటి కంపెనీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ స్కామ్ వల్ల 13,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించడానికే లగడపాటి సమైక్యాంధ్ర అంటున్నారని ఆయన అన్నారు. పోలీసుల చేతిలో గాయపడిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి యాకూబ్ రెడ్డి కేసును దర్యాప్తు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ విచారణ నుంచి పోలీసులు తప్పించుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు పదవులు తీసుకోవడం శోచనీయమని ఆయన అన్నారు.పదవులు తీసుకున్న కాంగ్రెసు నాయకులకు సన్మానాలు చేస్తే అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11687.html





