బొత్స రూటెటు?.. వైసీపీలో కొత్త టెన్షన్?

Publish Date:Mar 19, 2025

Advertisement

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ పక్క చూపులు చూస్తున్నారా?  వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండదని భయపడుతున్నారా? ఒక్కడిగా కాకుండా ఒక టీమ్ గా పార్టీని వీడాలని ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచే కాదు వైసీపీ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది. 
బొత్స పార్టీ మార్పు గురించి ఇప్పుడే కాదు గతంలోనూ  వార్తలు వచ్చాయి.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత బొత్స స‌త్య‌నారాయాణ కొద్ది కాలం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నాయన్న ప్రచారం ఓ రేంజ్ లో చేరింది. 
సరిగ్గా ఆ ప్రచారం జోరుగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా   ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. ఆ సమయంలో  విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా జగన్ ఖాతరు చేయలేదు. బొత్స పార్టీ మారకుండా ఆపడానికి ఆయనను ఎమ్మెల్సీ చేయడమే మార్గమని జగన్ భావించారు. 
ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీలో కీల‌కంగా మారారు. మండ‌లిలో విప‌క్ష నేత‌గా కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మంత్రుల‌ను నిల‌దీస్తున్నారు.  వైసీపీ త‌ర‌పున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు కావ‌డంతో,   మండలిలో విప‌క్ష నేత‌గా  వైసీపీ వాయిస్ ను  బొత్స బ‌లంగా వినిపిస్తూ వస్తున్నారు. తాను ఒక్కడిగా కాకుండా సభలో వైసీపీ సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో జగన్ కంటే బొత్స బెటర్ అన్న అభిప్రాయం వైసీపీ ఎమ్మెల్సీలలో ఏర్పడిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే  వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగు తున్న ప‌రిణామాల‌తో బొత్స ఒకింత అసంతృప్తితో ఉన్నారనీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలను ఆయన పార్టీ వర్గాల వద్ద నిర్మొహమాటంగా తప్పుపడుతున్నారనీ అంటున్నారు.  అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల‌ని త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మంచి మెస్సేజ్ వెళ్తుంద‌ని, అసెంబ్లీకి వెళ్ల‌కుండా ఉండ‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ు వైసీపీ ప‌ట్ట‌డంలేద‌న్న భావ‌న క‌లుగు తుంద‌ని  బొత్స జనగ్ కు చెప్పారనీ, అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారనీ, అయితే జగన్ ఆ సూచనను పట్టించుకోకపోవడంపై బొత్స అసంతృప్తితో ఉన్నారనీ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

ఇక్కడే బొత్స తన అసంతృప్తిని బహిర్గతం చేయకుండా చాపకింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు రాజకీయాలకు అతీతంగా అన్ని  పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొన‌సాగిన బొత్స‌.. అప్పట్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా కొన‌సాగారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ప్ర‌జాబ‌లం క‌లిగిన నేత‌గా బొత్స ఎదిగారు.  

 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చా రు. జగన్ కేబినెట్ లో బొత్స మంత్రిగా పని చేశారు. అప్పట్లో  జగన్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై బొత్స బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  ముఖ్యంగా సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ను బొత్స ఖండించిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్యంగా చిరంజీవి పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చిరంజీవి కుటుంబంతో బొత్స‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్లి బొత్స ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అంతే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బొత్స విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. 

దీనికి తోడు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని  వైసీపీ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేసిన సమయంలో.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స  అన్నారు. శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు  వ్యతిరేకంగా బొత్స‌ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎత్తి చూపుతూ బొత్స పార్టీ మార్పు యోచన చేస్తున్నారన్నడానికి ఇదే తార్కానమంటున్నారు వైసీపీ వర్గీయులు.   బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయంగా ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జ‌న‌సేన‌సేలో చేర‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.   

మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స  అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారు. సభలో ప్రతిపక్ష నేత పాత్రకు న్యాయం చేస్తూనే సభ బయట మాత్రం అధికార పక్ష నేతలతో , మరీ ముఖ్యంగా జనసేన నేతలతో సఖ్యతగా ఉంటున్నారు.  బొత్స ఈ తీరే ఆయన వైసీపీని వదిలేస్తారనీ, జనసేన గూటికి చేరతారనీ ప్రచారం జరగడానికి దోహదం చేస్తున్నది.  జగన్ ఏకపక్ష వైఖరి, ఇటీవలే ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ నేతగా తానున్నా… తనను కాదని ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించిన తీరుపై బొత్స అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బొత్స ఎప్పుడు గడపదాటతారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది.   

By
en-us Political News

  
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం.
ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిన్న ఒంగోలులో హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు.
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.
జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. దాసరి బాబురావు అనే బాధితుడు బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది
బూరగడ్డ అనిల్ అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు.
జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.