Publish Date:Apr 28, 2026
శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Publish Date:Apr 28, 2026
ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ముగ్గురిలో బెయిల్ కోసం రోహిత్ రెడ్డి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన ముగ్గురిలో మొదటిగా రోహిత్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు.
Publish Date:Apr 28, 2026
రవాణా, విద్యుత్ , పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సిక్కిం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానత మరింత బలోపేతం కానుంది.
Publish Date:Apr 28, 2026
హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
Publish Date:Apr 28, 2026
రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.
Publish Date:Apr 28, 2026
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
Publish Date:Apr 28, 2026
షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు.
Publish Date:Apr 27, 2026
రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ.. క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Publish Date:Apr 27, 2026
నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
Publish Date:Apr 27, 2026
తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.
Publish Date:Apr 27, 2026
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
Publish Date:Apr 27, 2026
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
Publish Date:Apr 27, 2026
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.