పోలవరం రివర్స్ టెండరింగ్ తో ఆదాపై అనుమానాలు .. కూపీ లాగుతున్న బీజేపీ!!

Publish Date:Oct 11, 2019

Advertisement

 

నిన్న మొన్నటి దాకా ఏపీలో హాట్ టాపిక్ గా నడచిన అంశం 'పోలవరం రివర్స్ టెండరింగ్'.  ఏపిలో రివర్స్ టెండరింగ్ పై కాషాయదళం కన్నేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదా అయిందని స్వయంగా సిఎం జగన్ ప్రధాని దగ్గర ప్రస్తావించారు. నిజంగా అంత జరిగుంటే మరి రాష్ట్రంలో వైసీపీ నేతలకు కనీసం సమాచారం ఎందుకు లేదు అన్న కోణంలో బిజెపి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  అన్ని కోట్లు ఆదా అయ్యాయని సర్కారు ఎందుకు ప్రచారం చేయటం లేదు అన్న విషయం పై చర్చకి తెరతీసింది. 

జగన్ ప్రభుత్వం ఒక పక్క నవరత్నాలు అమలు చేసే పనిలో ఉండగా మరోపక్క రివర్సు టెండరింగ్ లో నిధులు ఆదా చేసే అంశాలపై కూడా దృష్టి పెడుతూ రెండు కళ్లుగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీ వెళ్లి మరీ ప్రధాని దగ్గర రివర్సు టెండరింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రివర్సు టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూస్తామని మోదీకి చెప్పినట్లు వార్తలొచ్చాయి .ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది .అయితే రివర్స్ టెండరింగ్ లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి. పనులకు సంబంధించిన వాస్తవ లెక్కలు ఎలా ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారనే విషయాలు ఇంత వరకూ ఎక్కడా బయటికిరాలేదు.మోదీ దగ్గర జగన్ ప్రస్తావించిన రివర్సు టెండరింగ్ అంశాలపై ఏపీ బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీలో జగన్ ఏం చెప్పారు, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంటనే విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చెప్పినట్లే వందల కోట్లు ఆదా అయ్యయా అది ఎలా సాధ్యమైందనే సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతరత్రా నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొన్ని సందర్భాల్లో బిజెపి నేతలు ఒకడుగు ముందుకేసి బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్న వైసీపీ నేతల నుంచి కూడా సమాచారం తీసుకొంటున్నారు. 

టిడిపి హయాంలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో రివర్సు టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు ఆదా చేస్తే జగన్ సర్కార్ విజయం సాధించినట్లే.ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఇదంతా జరిగితే ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ,కానీ ఏపీ సర్కార్ ఎక్కడా ఈ విషయంలో పెద్దగా ప్రచార ఆర్భాటం చేయడంలేదు.మంత్రుల దగ్గర కూడా తగినంత సమాచారం ఇవ్వడంలేదు. అధికారులు కూడా ఈ విషయంలో తడబడుతున్నారు. దీంతో ఈ అంశంపై ఏపీ బీజేపీ ఫోకస్ చేసింది.నిజంగా జగన్ సర్కారు ఖజానా సొమ్మును కాపాడిన ఆ విషయాలు ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే పనులు పూర్తయిన తరవాత బిల్లుల చెల్లింపులు కూడా జరిగిన తర్వాత కానీ వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు.కాని జగన్ అప్పుడే ఈ విషయాలను ఎలా చెప్పారనే అంశంపై బిజెపి నేతలు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వచ్చాక అధిష్ఠానానికి నివేదిక పంపడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని  బీజేపీ లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు ప్రశ్నలకు ఇక జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.