ఆంద్రప్రదేశ్ లొ బిజెపి రూట్ మ్యాప్ మారినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేకర్ నిలిచింది. అసలు బిజెపి ఏపీలో తానే మార్గ సూచి అని ఇంత కాలం చెప్పుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ కు చిరు రూపంలో కమలం పార్టీ చెక్ పెట్టింది. చడీ చప్పుడూ లేకుండా మెగా స్టార్ ను తీసుకువచ్చి తెరముందు నిలిపింది.
రాజకీయాల నుంచి తెర మరుగై పోయి వెండి తెరపై వెలుగొందితే చాలని అనుకుంటున్న చిరంజీవిని భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన చెట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నాయని అంతా భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన, అందునా ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమానికి జనసేనానికి కనీసం ఆహ్వానం కూడా పంపకుండా అవమానించడమే కాకుండా... ఆయన సోదరుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూస్తుంటే.. ఇక పవన్ కల్యాణ్..కమలం పార్టీల మధ్య సఖ్యత చెడినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో ఇంత కాలం రహస్య మైత్రిగా సాగుతూ వచ్చిన బీజేపీ, వైసీపీ బంధం ఇకపై బహిరంగమేనని కూడా సూత్రీకరిస్తున్నారు. చిరంజీవిని అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి ప్రత్యేక గౌరవం ఇవ్వడానికి స్కెచ్ చాలా కాలం కిందటే మొదలై ఇప్పటికి తెరమీదకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక వైపు జనసేనాని సినిమా భీమ్లానాయక్ కు నష్టం వాటిల్లే విధంగా చర్యలు తీసుకుంటూనే.. ఆ సినిమాను మినహాయించి మిగిలిన సినిమాల విడుదల సమయానికి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేందుకు జరిపిన చర్చలలో చిరంజీవి పాల్గొన్న సమయంలోనే ఆయనను రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేయడం మొదలైందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికి అది ఒక రూపుదాల్చిందనీ, చిరంజీవి కమలం గూటికి చేరడం, ఏపీలో ఆ పార్టీ తరఫున క్రియాశీలంగా పని చేయడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. మొత్తం మీద ఇంత కాలం బీజేపీ పవన్ తొ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిందనీ, మిత్ర పక్షం అంటూ జనసేనతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తూ అధికార వైసీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక వైసీపీతో మైత్రిని బహిర్గతం చేయడం, జనసేనానికి గుడ్ బై చెప్పడం లాంఛనమే అని అంటున్నారు.
అయితే ఏపీ బీజేపీలోనే చిరంజీవి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని కమలం శ్రేణులు అంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పదవులు పొంది.. ఆ పదవీ కాలం పూర్తవ్యగానే సినిమాలే నా ప్రపంచం అంటూ వెళ్లిపోయిన చిరంజీవిని దగ్గరకు తీయడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన బీజేపీ మైత్రికి రోజులు దగ్గపడ్డాయన్నది మాత్రం ఖాయమైనట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-focuses-chiranjeevi-as-speed-breaker-to-pawan-39-139100.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.