విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?

Publish Date:Jul 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి..   రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.  నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో  కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు. 

ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు)  అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే..  జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా  మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి  (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. 

గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం  ప్రాంతాన్ని రాజధానిగా  అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు  నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై  విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు. 

 విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే.  అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.