ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో చెప్పించారు.
ముద్రగడ పద్మనాభంకు రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే.. 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా, కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది.
అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్. అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు.
జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-illtreat-mudragada-39-224956.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.