2029 ఎన్నికల్లోనూ ఓటమే.. వైపీపీ ఇప్పుడే డిసైడైపోయిదా?

Publish Date:Jul 4, 2026

Advertisement

వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో   చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.  

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా  విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను   ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది. 

ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే..  క్షేత్రస్థాయిలో  తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ  మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.  

 బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ  వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది.  కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు  ప్రతి ఇంటికీ వెళ్లి..  నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ   పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో  అర్హులైన ఏ  పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు.  

పోతే గీతే..  ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు..  చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో..    వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా  దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు.    

YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.