కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం......

Publish Date:Oct 13, 2012

Advertisement

ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందులో  ఒకటి కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ పనులతో సముద్రతీరానికి చేటు తెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ డ్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో ఏ ఉపద్రవం కాకినాడ సముద్రంలో చెలరేగినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదు. ఇంతకు ముందు వచ్చిన సునామీ కాకినాడను తాకకుండా బయటపడటానికి కారణం హోప్ ఐలాండ్ వల్లనేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇప్పటికే చేపలవేటకు వెళుతున్నజాలరులకు అక్కడ చేపలు ఏమాత్రం దొరకక వారిజీవనం దెబ్బతింది. అంతే కాకుండా రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గ, తదితర తీర ప్రాంతాలే కాకుండా కాకినాడ కూడా భారీ ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాకినాడ  సముద్ర మట్టంకంటే దిగువన ఉంది.  ధీంతో ఈ ప్రాంతప్రజలతో పాటు కోస్తా తీర వాసులంతా కలవరపడుతున్నారు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

By
en-us Political News

  
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.