మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్: 20 ఏళ్లలో 22 రెట్లు పెరిగిన పెట్టుబడి!
Publish Date:Jul 17, 2026
Advertisement
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనో, పిల్లల ఉన్నత చదువులనో లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడపాలనో ప్రతి ఒక్కరూ డబ్బును పొదుపు చేస్తుంటారు. అయితే, మనం సంపాదించిన డబ్బును కేవలం దాచడమే కాదు, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ లక్ష్యాలు దీర్ఘకాలికమైనవి అయితే, మీ పొదుపు మొత్తంలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఎంతో ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో ఊహించని రీతిలో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. మార్కెట్ ఒడిదొడుకుల రిస్క్ ఉన్నప్పటికీ, గత 20 సంవత్సరాల కాలంలో కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేశాయి. ముఖ్యంగా ఏడు అగ్రశ్రేణి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు గత 20 ఏళ్లలో పెట్టుబడిదారుల సొమ్మును ఏకంగా 22 రెట్లు పైగా పెంచి అద్భుతాలు సృష్టించాయి. ఈ జాబితాలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు ఉన్నాయని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ అద్భుతమైన రాబడుల రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచింది నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ గత 20 సంవత్సరాల కాలంలో ఏకంగా 16.8 శాతం వార్షిక రాబడిని (CAGR) అందించింది. దీనివల్ల ఇందులో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము 22.4 రెట్లకు పైగా పెరిగింది. అంటే 20 ఏళ్ల క్రితం పెట్టిన చిన్న మొత్తం ఇప్పుడు భారీ సంపదగా మారింది. ఆ తర్వాత స్థానంలో నిలిచిన హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. గత 20 ఏళ్లలో ఈ ఫండ్ 15.4 శాతం చొప్పున అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల పెట్టుబడిని ఏకంగా 17.6 రెట్లు పెంచి లాభాల పంట పండించింది. మిడ్ క్యాప్ విభాగంలో స్థిరమైన ప్రదర్శన చేసిన ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. ఈ ఫండ్ 20 సంవత్సరాల వ్యవధిలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 16.9 రెట్లు పెంచి సత్తా చాటింది. అలాగే, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సైతం దీర్ఘకాలంలో అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. గత రెండు దశాబ్దాలలో ఈ ఫండ్ పెట్టుబడిదారుల డబ్బును 15.8 రెట్లు పెంచడం విశేషం. equity mutual funds wealth creation,top seven mutual funds india.
http://www.teluguone.com/news/content/best-mutual-funds-20-years-returns-36-226332.html





