ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ సీజ్… ఐటీ అదుపులో “కొండ”

Publish Date:Mar 27, 2026

Advertisement

 

శేరిలింగంపల్లికి చెందిన వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఈ ఘటన నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటుచేసుకుంది... గురువారం సాయంత్రం సమయంలో న్యూఢిల్లీలో జరగనున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండా విజయ్ కుమార్‌ను  హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో స్థానిక ఐటీ అధికారులు అడ్డుకుని పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే... అక్కడి ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ లోనే విచారణ ప్రారంభించారు.

విచారణ సమయంలో ఆయన వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని పూర్తిగా సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 12 గంటల పాటు కొండ విజయ్ కుమార్ ను విచారణ చేసిన  అనంతరం హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉందని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తో కొండ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు చేపట్టిన చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది.
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.