హైకోర్టులో బండి సాయి భగీరథ ముందస్తు బెయిల్ విచారణ

Publish Date:May 14, 2026

Advertisement

 

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా.. 

అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని బండి భగీరథ్ పిటిషన్ ..

ముందస్తు బెయిల్ వచ్చేవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు...

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముందస్తు బెయిల్ పిటిషన్ లో దాఖలైన మధ్యంతర రక్షణ పిటిషన్‌పై  హైకోర్టు ఈరోజు వాదనలు విన్నది. ముందస్తు బెయిల్ వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బండి భగీరథ తరఫున న్యాయవాది కోర్టును కోరారు.. వాదనలు విన్న అనంతర మధ్యంతర రక్షణ పిటిషన్ పై ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసింది. యాంటిసిపెటోరీ బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చేవారం జరగనుంది...


ఈ విచారణ సందర్భంగా కేసులో ఉన్న యువతి మైనర్ అవునా.... కాదా... అనే అంశంపై న్యాయ మూర్తి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. “ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని ఎలా నిరూపిస్తారు?” అని కోర్టు ప్రశ్నించింది
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కీలక వివరాలు కోర్టుకు తెలియజేశారు. ఐదేళ్ల క్రితం నమోదైన ఒక కేసులో, యువతి 15 ఏళ్ల వయసులో కారు నడిపినట్లు నమోదు కాగా, అందులో ఉన్న జనన తేదీ వివరాలు సరైనవే అయితే ప్రస్తుతం ఆమె మేజర్ అవుతుందని వాదించారు.

అదే సమయంలో, యువతి పలు తేదీలతో జనన ధృవీకరణ పత్రాలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు. ఈ కేసు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి రాదని, అలాగే భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. సంబంధిత సంఘటన ఎనిమిది నెలల క్రితం జరిగినప్పటికీ, ఇప్పుడే ఫిర్యాదు చేయడం వెనుక దురుద్దేశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. బాధితురాలు వయసు ప్రస్తుతం 19 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. 

బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులు సృష్టించి, వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని కోర్టుకు తెలియజేశారు. యువతి మైనర్ కాదని నిరూపించే ఆధారాలు ఉంటే  వెంటనే కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది... బాధితురాలు పుట్టినరోజు తేదీపై గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అనే పోలీసులు ఫైల్ చేసిన చార్జిషీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది... ఫిర్యాదు చేసిన యువతి మరియు ఆమె కుటుంబం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, డబ్బు చెల్లించక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని పిటిషనర్ తెలిపారు. 

ఈ బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు కావడంతో తనపై కుట్ర జరుగుతోందని పిటిషనర్  కోర్టుకు తెలిపారు.... అంతేకాకుండా సిటీలో బండి సంజయ్ కుమార్ మరియు అతని కుమారుడు బండి భగీరథ పోస్టర్లు వేస్తున్నారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బండి సంజయ్ కొడుకు బండి భగీరథ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు... ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారం జరగనుంది..

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.