ఆశా భోంస్లే మృతి పట్ల సినీ తారల సంతాపం

Publish Date:Apr 12, 2026

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. “ఆశా భోస్లే గారి గొంతు భారతీయ సినిమాకు తరతరాలుగా నిలిచిపోయే అపూర్వమైన సంపద. ఎన్నో భావోద్వేగాలను పలికించిన ఆమె గాత్రం ప్రతి పాటలోనూ అప్రయత్నమైన శైలి, వైవిధ్యంతో ఆకట్టుకుంది. భారతీయ సినిమా భర్తీ చేయలేని గొంతుకను కోల్పోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.

ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ కూడా ‘ఎక్స్’లో వీడియో క్లిప్ షేర్ చేస్తూ హిందీలో నివాళులు అర్పించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, “ఆశాజీని కోల్పోవడం నాకు వ్యక్తిగత నష్టంలా అనిపిస్తోంది. ఆమె గాత్రం నా చిత్రాలను అలంకరించింది” అని రాశారు. కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి స్పందిస్తూ, “హద్దులు దాటిన గొంతుక ఆమెది. ఆమె లేని లోటు భారతీయ సినిమా, సంగీత ప్రపంచానికి తీరనిది” అని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “ఆశా భోస్లే గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆమె మాయా గాత్రం గుండెచప్పుడులా నిలిచింది. ఆమె వారసత్వం తరతరాలకు నిలిచిపోతుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.

సీనియర్ నటుడు మోహన్ బాబు, “ఆశా భోస్లే గారితో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె గాత్రం కేవలం సంగీతం కాదు, మన జీవితంలోని ప్రతి దశలో మనతో ఉన్న భావోద్వేగం. తరతరాల హృదయాలను ఆమె లాగా స్పృశించిన కళాకారులు అరుదు” అని తెలిపారు. విష్ణు మంచు కూడా, “మనం ఆమె పాటలను కేవలం వినలేదు… వాటితో జీవించాం. ఇది పూడ్చలేని లోటు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళ నటుడు విక్రమ్ ప్రభు, ఆశా భోస్లేతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ఆశా గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆమె మా కుటుంబ సభ్యురాలే. చెన్నైకి వచ్చినప్పుడల్లా మా తాత శివాజీ గణేశన్ ఇంట్లోనే ఉండేవారు” అని తెలిపారు. ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ఆమెకు నివాళులు అర్పించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆశా భోస్లే మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. “ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతో పాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మహాగాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలిని కూడా అలవోకగా ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే’, ‘ఇన్ ఆంఖో కి మస్తీ’, ‘రాధా కైసే న జలే’ వంటి గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు. 

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అమలు ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచిన తర్వాత, ఇప్పుడు అమెరికా దృష్టి మలక్కా జలసంధి వైపు మళ్లింది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం, ఈ వ్యూహాత్మక మార్పుకు ప్రధాన సూచికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.