రైతు ఘోష పట్టని జగన్ సర్కార్.. ‘ఆసని’ బాధిత రైతుల నోట మట్టేనా?

Publish Date:May 14, 2022

Advertisement

ధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అసని తుపాను కల్లోలం సృష్టించింది.  వందల ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. మచిలీపట్నానికి 20 కిలో మీటర్లు, నర్సాపురానికి 40 కిలోమీటర్ల మధ్య కొద్ది రోజుల  తీరం దాటిన   ‘అసని’ ప్రభావంతో    జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన వరి, అరటి, మామిడి, జీడిమామిడి, బొప్పాయి, కొబ్బరి, నిమ్మ, మొక్కజొన్న, వేరుశనగ పంటలు నేల మట్టం అయ్యాయి. ఉద్యానవన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది.  అయినా జగన్ సర్కార్ తుపాను సమయంలో ఏమాత్రం సహాయక చర్యలు నిర్వహించలేదనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.

అసని తుపాను వెళ్లిపోయినా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పంట, ఆస్తి నష్టాలను అంచనా వేయడానికి, సహాయం చేయడానికి రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తుపాను, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, వెంటనే అన్నదాతలను ఆదుకోవాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ జగన్ కు లేఖ రాశారు.  వర్షాలు, వరదల కారణంగా ఒక్కో ఎకరానికి సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని  పేర్కొన్నారు. తుపానులు, వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, తగిన నిధులు విడుదల చేసేలా కేంద్రంపై వైసీపీ సర్కార్ ఒత్తిడి పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

అసని తుపాను కారణంగా ఏపీలోని పంటలకు 2 వేల 500 కోట్ల మేర నష్టం జరిగిందని గ్లోబల్ కన్సల్టెన్సీ ఆర్ఎంఎస్ఐ అంచనా వేసింది. ఏపీలో అసని తుపాను కారణంగా అత్యధికంగా 30వేల హెక్టార్లలో వరిపంట నాశనమైందని ప్రాథమిక అంచనా. మొక్కజొన్న 6 వేల 95 హెక్టార్లలో, మినుము పంట, 3 వేల 882 హెక్టార్లలో, వేరుశనగ, 875 హెక్టార్లలో నువ్వుల పంట, 589 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 200 హెక్టార్లలో, బఠాని పంటలు నాశనమయ్యాయి. వాటితో పాటు సజ్జలు, పత్తి, చెరకు, రాగి, మిర్చి, టమోటా, మునగ, జామ, దానిమ్మ, తమలపాకు, కాయగూరలు, ఆకుకూరల పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే.. పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో ఎప్పుడు అంచనా వేస్తారు, నష్టపరిహారం ఎప్పుడు అందచేస్తారన్న విషయం అంతు చిక్కకుండా ఉందని బాధితులు వాపోతున్నారు.

అసని తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, మామిడి, అరటి రైతులు బాగా నష్టపోయారు. వందలాది ఎకరాల్లోని మామిడి నేల రాలిపోయింది. నేల రాలిన మామిడి పంటను చూసిన రైతుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. గెలలు వేసిన అరటి తోటలు నేలమట్టం అవటంతో రైతుల పరిస్థితి దీయనీయంగా మారింది. రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో మామిడి, జీడిమామిడి తోటల రైతులు బాగా నష్టపోయారు.   మొక్కజొన్న, వేరుశనగ, అరటి, బొప్పాయి పంటలు ధ్వంసం అవడంతో రైతులు దీనస్థితిలోకి వెళ్లిపోయారు. కోనసీమ జిల్లాలో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంటతో పాటు రాసులుగా పోయిన ధాన్యం తడిసి ముద్దై పోయింది.

అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, రాజోలు, అమలాపురం, మాచవరంలలో వరి పంటలు నేలకొరిగాయి. కాకినాడ జిల్లా రైతులకైతే అసని గుండెకోత మిగిల్చింది. అసని కారణంగా కృష్ణా జిల్లాలోని అరటి, మొక్కజొన్న తోటలు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో బొప్పాయి, మామిడి, అరటి పంటలు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 12 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

అసని తుపానుతో పంటలకు ఇంత భారీ ఎత్తున నష్టం వాటిల్లినా ఏపీ సర్కార్ ఏమి చేస్తోందని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.